యోగి సర్కార్ సరికొత్త కార్యక్రమం ... ఇవాళ్టి నుండే షురూ

అంటువ్యాధుల నియంత్రణకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా యోగి సర్కార్ తీసుకునే చర్యలివే....

Yogi Government Launches Statewide Campaign to Combat Communicable Diseases AKP

లక్నో : వర్షాకాలంలో సంక్రమించే సీజనల్, అంటు వ్యాధులను మరీముఖ్యంగా ఎన్సెఫలైటిస్‌ను సమర్థవంతంగా నియంత్రించడానికి యోగి ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.  ఇందులో భాగంగా కమ్యూనికేబుల్ డిసీజ్ కంట్రోల్ ప్రచారాన్ని ప్రారంభించింది... ఇది అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. దీంతోపాటు అక్టోబర్ 11 నుండి దస్తక్ ప్రచారాన్ని కూడా ప్రారంభమవుతుంది... ఇది కూడా అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు 13 విభాగాలు పరస్పర సమన్వయంతో ఈ ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం యోగి ప్రజలను ఈ ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కమ్యూనికేబుల్ వ్యాధుల నివారణకు అవగాహన చాలా అవసరమని... ప్రజలు తమను తాము కాపాడుకుంటూనే ఇతరులను ఈ వ్యాధుల గురించి అప్రమత్తం చేయాలని యోగి సూచించారు. 

కమ్యూనికేబుల్ వ్యాధుల నిర్మూలనకు యాక్షన్ ప్లాన్ ఇదే

సీఎం యోగి ఆదేశాల మేరకు రాజధాని లక్నోలోని అలీగంజ్‌లోని సీహెచ్‌సీలో కమ్యూనికేబుల్ డిసీజ్ కంట్రోల్ ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి (వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం) పార్థసారథి సేన్ శర్మ మాట్లాడుతూ, కమ్యూనికేబుల్ వ్యాధుల నిర్మూలన దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఏడాది పొడవునా వివిధ నెలల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

 ఇవాళ్టి (మంగళవారం) నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కమ్యూనికేబుల్ వ్యాధుల నిర్మూలన బృందాలు ఇంటింటికీ తిరుగుతాయని ... ఈ ప్రచార కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, కాలాజార్ వంటి ఇతర కమ్యూనికేబుల్ వ్యాధుల నిర్మూలనకు 13 విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. సీఎం యోగి అవిశ్రాంత కృషి ఫలితంగా కమ్యూనికేబుల్ వ్యాధుల నియంత్రణలో గణనీయమైన విజయం సాధించామని ఆయన అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో, చుట్టుపక్కల నీరు నిల్వకుండా చూసుకోవాలని... ఖాళీ స్థలాల్లో పరిశుభ్రత పాటించాలని... చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి

ఈ ప్రచారణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం ఫాంగింగ్, యాంటీ లార్వా స్ప్రేలు చల్లుతారు. అంతేకాకుండా కమ్యూనికేబుల్ వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి పారిశుధ్య కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహిస్తారు. ఇళ్లలో పెరిగే లార్వాను నాశనం చేయడంలో వారు సహాయం చేస్తారు.

డెంగ్యూ, మలేరియా కేసులు బయటపడితే కుటుంబ సభ్యులు, సమీపంలో నివసించే వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రచారణ సందర్భంగా డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర కమ్యూనికేబుల్ వ్యాధులకు గురయ్యే ప్రాంతాలను గుర్తిస్తారు. ఈ ప్రాంతాల్లో ఫాంగింగ్, యాంటీ లార్వా స్ప్రేలు చల్లడం, పారిశుధ్య కార్యక్రమాలు చేపడతారు. వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం, జ్వరం వంటి లక్షణాలు ఉన్న రోగులు కనిపిస్తే శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రచారణలో భాగంగా ప్రజలు జ్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, వైద్యుడిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios