Asianet News TeluguAsianet News Telugu

నిండు గర్భిణి ప్రాణాలు తీసిన తప్పుడు మెడికల్ రిపోర్టు.. డాక్టర్‌పై కేసు నమోదు

మహారాష్ట్రలో ఓ వైద్యుడి తప్పుడు రిపోర్టు నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గర్బిణిని సోనోగ్రఫీ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ, ఆమె సోనోగ్రఫీ రిపోర్టును తప్పుగా ఇచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగా అబార్షన్ పిల్స్ ఇవ్వడంతో ఆ గర్భిణి కూడా ప్రాణాలు కోల్పోయింది.
 

wrong sonography report killed pregnant, case filed on doctor
Author
First Published Oct 8, 2022, 8:20 PM IST

ముంబయి: గర్భవతులను వారి కుటుంబం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. క్షణక్షణం వారిని కనిపెట్టుకుని ఉంటారు. సకాలంలో హాస్పిటల్‌లో చెకప్‌లు చేయించడం, తల్లీ, శిశువు ఎదుగుదలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని వైద్యులు సూచించే సలహాలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు. కానీ, జాగ్రత్తలు చెప్పాల్సిన డాక్టరే తప్పు చేస్తే? మహారాష్ట్రలో ఓ డాక్టర్ చేసిన పొరపాటుకు నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు సదరు డాక్టర్ పై కేసు పెట్టారు. సెక్షన్ 304 ఏ కింద కేసు రిజిస్టర్ చేశారు.

మహారాష్ట్రలో థానే జిల్లాలోని కళ్యాణ్ టౌన్‌లో ఓ డాక్టర్ సోనోగ్రఫీ సెంటర్ నడుపుతున్నారు. ఆయన 28 ఏళ్ల గర్భిణీకి సోనోగ్రఫీ చేశారు. కానీ, ఆయన సరైన రిపోర్టు ఇవ్వలేదు.

కళ్యాణ్‌లోని ఓ హాస్పిటల్‌లో ఆ గర్భిణీ గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో చికిత్స పొందింది. ఆమెను సోనోగ్రఫీ టెస్టు చేసుకోవాలని రిఫర్ చేశారు. ఆమె సోనోగ్రఫీ సెంటర్‌కు వెళ్లి ఆ టెస్టు చేసుకున్నారు. కానీ, ఆ సోనోగ్రఫీ రిపోర్టు తప్పుగా ఇచ్చారు. గర్భంలో పిండం ఎదుగుదల సరిగా లేదని ఆ తప్పుడు రిపోర్టు తెలిపింది.

ఈ రిపోర్టు ఆధారంగా వైద్యులు ఆమెకు గర్భస్రావం టాబ్లెట్లు ఇచ్చారు. ఈ గర్భస్రావంతో ఆ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. సోనోగ్రఫీ తప్పుడు రిపోర్టు, వైద్యుల నిర్లక్ష్యంతో ఆ గర్భిణి ప్రాణాలు కోల్పోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

కన్‌గావ్ పోలీసు స్టేషన్ అధికారులు ప్రకారం, ఆ డాక్టర్ పై కేసు నమోదు అయింది. దర్యాప్తు ప్రారంభించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. మర్డర్ కేసు కాకుండా.. నిందార్హమైన ప్రాణ హననం కింద కేసు పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios