తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రజలందర్నీ విడతల వారీగా చంద్రునిపైకి పంపుతానన్నాడు. ఇప్పుడు ప్రముఖ డీఎంకే పార్టీకి చెందిన ఒక నేత కూడా ఇలాగే నోరు జారి ట్రోల్ అవుతున్నాడు

త్వరలో తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటి నుంచే అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించి ప్రసంగాలు, హామీలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. 

తాజాగా ఓ స్వతంత్ర అభ్యర్థి.. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రజలందర్నీ విడతల వారీగా చంద్రునిపైకి పంపుతానన్నాడు. ఇప్పుడు ప్రముఖ డీఎంకే పార్టీకి చెందిన ఒక నేత కూడా ఇలాగే నోరు జారి ట్రోల్ అవుతున్నాడు. డీఎంకే పార్టీకి చెందిన దిండిగల్ లియోని అనే నేత మహిళల శరీర ఆకృతి గురించి కామెంట్స్ చేశాడు. ‘‘గతంలో అమ్మాయిల నడుములు 8 అంకె ఆకారంలో ఉండేవి. పిల్లలను ఎత్తుకున్నప్పుడు వాళ్లు చాలా ప్రశాంతంగా కూర్చొనేవారు’’ అని దిండిగల్ అన్నాడు.

విదేశీ ఆవుల పాలు తాగడంతో ఈ పరిస్థితి మారిపోయి మహిళలు తమ 8 ఆకృతిని కోల్పోయారని ఆయన వివరించాడు. మహిళలు బూరల్లా తయారయ్యారని విమర్శించారు. ‘‘ఇప్పుడు చిన్నపిల్లలను ఎత్తుకుంటే.. వాల్లే పెద్ద బ్యారెల్స్‌లా ఉండటంతో జారీపోతున్నారు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.