వాళ్లిద్దరూ దాదాపు ఎనిమిది సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఆశపడింది. అయితే.. సడెన్ గా.. ఆ యువకుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తకుండా.. బ్రేకప్ చెప్పేశాడు. దీంతో.. డేటింగ్ పేరిట ఎనిమిది సంవత్సరాలు టైమ్ వేస్ట్ చేశాడంటూ మాజీ బాయ్ ఫ్రెండ్ పై ఆ అమ్మాయి కేసు పెట్టింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గెట్రూడె గోమా అనే యువతి హర్బర్ట్ సలైకీతో ఎనిమిదేళ్లుగా డేటింగ్ లో ఉంది. అతను భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటా అన్నాడే కానీ, ఒక టైం అనేది చెప్పలేదు. అవన్నీ తేల్చుకోవడానికే ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. జాంబియాలోని కోర్టుకు 26ఏళ్ల తన పార్టనర్.. రిలేషన్‌షిప్‌ను సీరియస్ గా తీసుకోలేదని చెప్పింది. అతనెప్పుడూ సీరియస్ గా ప్రవర్తించలేదు. అందుకే అతణ్ని కోర్టుకు తీసుకొచ్చా. ఎందుకంటే మా భవిష్యత్ గురించి నాకు ఐడియా ఉండాలి కదా’ అని యువతి అంటోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వారికి ఒక సంతానం కూడా ఉంది. కానీ, బాయ్ ఫ్రెండ్ ఆమె నుంచి కట్నం అడుగుతున్నాడట. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కట్నం ఖర్చు పెట్టుకుందామని అనుకుంటున్నాడట.పెళ్లి అనేది జరగకుండా ఈ విషయం ముందుకు వెళ్లకూడదని జడ్జి చెప్పారు.