మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టి .. వారితో గత కొన్ని సంవత్సరాలుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న లేడీ డాన్, వేశ్య సామాజ్ర అధినేత్రి సోనూ  పుంజాబన్ కు 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 

మైనర్ బాలికను కొని వారిని వ్యభిచారపు వృత్తిలో దించి వారిని విక్రయిస్తున్న రాకెట్ నిర్వహించిన గీత అరోరా అలియాస్ సోనూ పుంజాబన్ కు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ప్రీతం సింగ్ తీర్పు చెప్పారు. 

మైనర్ బాలికను కొనుగోలు చేసి వారితో వ్యభిచారపు దందా నిర్వమించిన సోనూఫుంజాబన్ పై పోలీసులు ఐపీసీ సెక్సన్ 366, 372,373, 328,342 120 బి ల కింద కేసు నమోదు చేశారు. సోనూ సహనిందితుడైన సందీప్ బేడ్వాల్ కు బాలికల కిడ్నాప్, విక్రయం, అత్యాచారం కేసులో 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. జైలు శిక్షతోపాటు జడ్జి వీరిద్దరికి 65వేలరూపాయల జరిమానా కూడా విధించారు.