Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. పడగ విప్పిన పాము నుంచి కొడుకును కాపాడుకున్న తల్లి.. భయానక వీడియో ఇదే

కర్ణాటకలో ఓ తల్లి తన కొడుకును కాపాడుకున్న విధం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. మెట్ల పై నుంచి తల్లి కొడుకులు కిందికి దిగుతున్న సమయంలో కింది వైపు నుంచి పాము జారుకుంటున్నది. ఆ పిల్లాడు ఓ అడుగు ముందుగా కింద వేశాడు. అంతే.. ఆ అడుగు నుంచి తప్పించుకున్న పాము అంత ఎత్తుకు లేచి పడగ విప్పింది. తల్లి వెంటనే అప్రమత్తమై కొడుకును  కాపాడుకుంది.
 

woman saves son from huge cobra in karnataka.. scary video went viral
Author
Bengaluru, First Published Aug 13, 2022, 4:38 PM IST

బెంగళూరు: తల్లి ప్రేమను కొలువలేం. దేనితోనూ పోల్చలేం. అందుకే ఆమె ప్రేమ అనుపమానం. కన్న బిడ్డ కోసం తన ప్రాణాలైన అడ్డేసి నిలుస్తుంది. ఇదే విషయం మరోసారి రూఢీ అయింది. కర్ణాటకలో ఓ తల్లి తన కొడుకును పడగ విప్పిన పాము నుంచి కాపాడుకుంది. తన ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి కొడుకును కాపాడిన వైనం ఓ సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నెటిజన్లు అంతా ఆ తల్లి సాహస కార్యానికి ఫిదా అవుతున్నారు. లవ్ ఎమోజీలతో ముంచెత్తుతున్నారు.

కర్ణాటకలోని మాండ్యాలో తల్లి, కొడుకు ఇంటి బయటకు వస్తున్నారు. వారు దాదాపు మెట్ల వరకు వచ్చారు. ఆ మెట్ల కింది నుంచి నిశ్శబ్దంగా ఓ పాము జారుకుంటున్న విషయం వారికి తెలియదు. మెట్ల దాకా వచ్చిన తర్వాత కొడుకు తల్లి కంటే ఓ అడుగు ముందుకు నడిచాడు. మెట్లు దిగుతూ కింద అడుగు వేశాడు. ఆ అడుగు సరిగ్గా పాము పైన పడుతుండగా... ఆ భారీ నాగు పాము వెంటే అప్రమత్తమై తలతోపాటుగా దాదాపు సగం మేరకు వెనక్కి కదిలింది. ఈ చర్య చాలా వేగంగా జరిగింది. వెనక్కి తీసుకుంటూనే పాము దాదాపు మోకాలి ఎత్తు వరకు పడగ విప్పి నిలబడింది. ఆ వీడియో చూస్తున్నవారికే పై ప్రాణాలు పైకే పోయేంత పని అవుతున్నది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India Today (@indiatoday)

అలా పడగ విప్పి అంత ఎత్తు లేచిన పాము ముందు కొడుకు ఉన్నాడు. మెట్ల పై ఉన్న తల్లికి ఆ పాము పడగ కనిపించింది. అంతే.. మరో ఆలోచనే లేకుండా ఆమె వెంటనే మెట్లు దిగి కొడుకును రక్షించుకుంది. ఆ తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకోగానే.. ఆగ్రహంగా పడగ విప్పి పైనకు లేచిన పాము మళ్లీ తన దారిలో తాను వెళ్లిపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ పై చాలా మంది కామెంట్లు చేశారు. ఆ తల్లి చేసిన కార్యానికి ఫిదా అవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios