Asianet News TeluguAsianet News Telugu

యువకుడితో ప్రేమాయణం.. భర్త డబ్బులతో భార్య పరార్..!

కిషోర్ తన భార్యా పిల్లలను అదే గ్రామంలో ఓ అద్దె ఇంట్లో ఉంచి అతడు మాత్రం ఉద్యోగం నిమిత్తం గుజరాత్‌లో ఉండేవాడు అప్పుడప్పుడు భార్యాపిల్లలను చూసేందుకు గ్రామానికి వచ్చి పోతుండేవాడు

woman ran away with husband money in bihar
Author
Hyderabad, First Published Aug 26, 2021, 10:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వారికి పెళ్లై దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇటీవల.. కుటుంబం కోసం భర్త వేరే ఊరు వెళ్లాడు. ఈ క్రమంలో.. సంపాదన మొత్తాన్ని భార్య ఖాతాకు బదిలీ చేసేవాడు. ఇటీవల పొలం అమ్మి.. ఆ డబ్బులను కూడా భార్య ఖాతాలోనే వేశాడు.  ఇటీవల భార్య ,  బిడ్డలను చూద్దామని ఇంటికి వచ్చే సరికి.. ఆమె కనిపించలేదు. ఆరా తీస్తే.. తాను పంపిన డబ్బులతో సహా.. భార్య మరో వ్యక్తితో పరారైనట్లు  గుర్తించాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రజ్ కిషోర్‌కు 14 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్య పేరు ప్రభావతీ దేవి. వారికి ఇద్దరు పిల్లలు. బిహార్‌లోని పట్నా జిల్లాలోగల బిహ్‌టా మండలం పరిధిలోని ఓ చిన్న గ్రామంలో వారు నివిస్తుంటారు. పిల్లలకు పెద్దవాళ్లవుతున్న నేపథ్యంలో వారికి మంచి చదువులు చెప్పించాలని కిషోర్ దంపతులు నిర్ణయించారు. ఈ క్రమంలో..పెద్దనగరంలో కాపురం పెడితే పిల్లల చదువుకు అనువుగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. కాగా.. కిషోర్ తన భార్యా పిల్లలను అదే గ్రామంలో ఓ అద్దె ఇంట్లో ఉంచి అతడు మాత్రం ఉద్యోగం నిమిత్తం గుజరాత్‌లో ఉండేవాడు అప్పుడప్పుడు భార్యాపిల్లలను చూసేందుకు గ్రామానికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో అతడి జీవితంలో ఓ అనర్థం జరిగింది. అతడి భార్య పొరిగింటి యువకుడికి దగ్గరైయ్యింది. తన భర్తకు అసలు ఏమాత్రం అనుమానం రాకుండా.. మొత్తం వ్యవహారం నడిపింది. 

ఇక పథకం ప్రకారం.. సిటీలో ఇల్లు కొనుక్కుందామని కోరింది. అతడికీ ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తనకున్న పోలాన్ని అమ్మేశాడు. అలా చేతికొచ్చిన రూ. 39 లక్షలను భార్య పేర ఉన్న బ్యాంక్ అకౌంట్లో వేశాడు. ఆ తరువాత.. యథాప్రకారం తన పనిమీద వెళ్లిపోయాడు. ఇటీవలే మరోసారి భార్య పిల్లలను చూసుకునేందుకు గ్రామానికి వచ్చాడ్డు. కానీ ఇంటికి మాత్రం తాళం పెట్టి ఉండటంతో అతడికి మొదట అసలేమీ పాలుపోలేదు. దీంతో..ఇంటి యజమానిని వాకబు చేశాడు.

‘‘మీ ఆవిడ రెండు రోజుల క్రీతమే తన పిల్లలను తీసుకుంది వెళ్లిపోయింది. ఎక్కడికి వెళుతున్నదీ నాకైతే చెప్పలేదు’’ అని ఇంటి యజమాని అన్నాడు. దీంతో..కిషోర్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకో అనుమానమొచ్చి.. భార్య బ్యాంక్ అకౌంట్‌ వివరాలు చూస్తే.. అందులో కేవలం 11 రూపాయలు మాత్రమే మిగిలినట్టు బయటపడింది. దీంతో.. లబోదిబోమంటూ అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. ప్రభావతీ దేవీ మరోవ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతో..ఆమె ఆచూకీ తెలుకునేందుకు వారు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios