19 ఏళ్ల విమలేష్ షా ఆదివారం నుంచి కనిపించడం లేదు. సోమవారంనాడు రైల్వే ట్రాక్స్ సమీపంలో అతని శవం కనిపించింది.  అతని శవాన్ని చూసిన దామోదర్ పూర్ గ్రామానికి చెందిన ప్రజలు సమీపంలోని రెడ్ లైట్ ఏరియాలోనివారు చంపేశారని అనుమానించారు.

పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ గుంపు సోమవారంనాడు మహిళ దుస్తులిప్పేసి ఆమెను నగ్నంగా ఊరేగించారు. ఓ వ్యక్తి మరణానికి కారణమైందనే ఆగ్రహంతో వారు ఆ ఘాతుకానికి ఒడిగట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

19 ఏళ్ల విమలేష్ షా ఆదివారం నుంచి కనిపించడం లేదు. సోమవారంనాడు రైల్వే ట్రాక్స్ సమీపంలో అతని శవం కనిపించింది. అతని శవాన్ని చూసిన దామోదర్ పూర్ గ్రామానికి చెందిన ప్రజలు సమీపంలోని రెడ్ లైట్ ఏరియాలోనివారు చంపేశారని అనుమానించారు. 

దుకాణాలను దగ్ధం చేశారు. స్థానికులను, దుకాణాల యజమానులను కొట్టారు. ఓ భవనంలోని మహిళను బయటకు లాక్కొచ్చారు. ఆమె దుస్తులు విప్పేసి కొట్టుకుంటూ, తన్నుకుంటూ ఆమెను నగ్నంగా ఊరేగించారు. 

ఆ మహిళ కేకలు వేస్తూ సాయం కోసం అంగలార్చినా కూడా వారు వినలేదు. ఆమెను పోలీసు స్టేషన్ లో అప్పగించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

అటుగా వెళ్తున్న రైలుపై రాళ్లు విసిరారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. గ్రామస్థులు ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఈ సంఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే విషయాన్ని ఈ సంఘటన రుజువు చేస్తోందని ఆయన అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను సంబోధిస్తూ ట్వీట్ చేశారు.