ఓ మహిళకు పెళ్లై భర్త ఉన్నాడు. కానీ ఆమె మరో వ్యక్తి వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో బంధం కొనసాగించాలంటే... భర్త ఆమెకు అడ్డుగా తోచాడు. దీంతో.... అతనిని చంపేయాలని అనుకుంది. దానికి తన ప్రేమికుడి సహాయం తీసుకుంది. ఆమె పథకం బెడిసి కొట్టింది. ఉన్నదీ పోయింది.. ఉంచుకున్నదీ పోయింది అనే చందంగా... భర్తతోపాటు... ప్రియుడు కూడా ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సూరత్ కి చెందిన ఖుష్బు పాటిల్ ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు కమల్(35) అనే వ్యక్తితో ఇదివరకే వివాహమైంది. కాగా... ఇటీవల ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఓ సెమినార్ కి వెళ్లింది. అక్కడ ఆమెకు  తుషార్ పాటిల్ (28) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె తన భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకు ప్రియుడు తుషార్ తో కలిసి ప్లాన్ వేసింది.

Also Read అప్పుడు ఎల్లో, ఇప్పుడు పింక్ చీరలో... మరోసారి సెన్సేషన్ గా ఎన్నికల అధికారి

ప్లాన్ ప్రకారం ఖుష్బు,  తుషార్ లు.. సోమవారం సాయంత్రం కమల్ ని కోసమ్ కంటారా అనే నది వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తనకు టాయ్ లెట్ వస్తోందని చెప్పి... ఆమె పక్కకు వెళ్లింది. అక్కడ నిల్చొని ఉన్న కమల్ ని తుషార్ నీటిలో తోసేసి చంపాలని ప్లాన్ వేశారు. అయితే... కమల్ ని నీటిలోకి తోస్తుండగా... అతను లాగడంతో తుషార్ కూడా నీటిలో పడిపోయాడు.  నీటిలోకి దూకిన తర్వాత కూడా ఒకరిని మరొకరు చంపేందుకు నీటిలో ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు .. నీటిలో మునిగి ఇద్దరూ మృతి చెందారు.

వీరిద్దరి మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. కాగా... ఈ కేసులో ఖుష్బుని పోలీసులు అరెస్టు చేశారు. భర్తను చంపేందుకు ప్లాన్ వేసి ఆ ప్రాంతానికి తీసుకువచ్చినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కమల్,కుష్బు దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.  కాగా కమల్... ఎలక్ట్రికల్ రిపేర్ గా పనిచేస్తుండగా..ప్రియుడు తుషార్.. ఓ బ్యాంక్ లో ప్యూన్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. వారిద్దరూ నీటిలో పడిపోయిన వెంటనే... రక్షించేందుకు ఖుష్బు స్థానికులను కోరింది. అయితే.. వారు వచ్చేసరికి వాళ్లు ఒకరిని మరొకరు నీట ముంచుకొని చనిపోవడం గమనార్హం.