Asianet News TeluguAsianet News Telugu

భార్యను సంవత్సరంపాటు టాయ్ లెట్ లో బంధించిన భర్త

భర్తే ఏడాదిపాటు మరుగుదొడ్డిలో బంధించాడని తెలిసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో బలహీనంగా ఉన్న మహిళను అధికారులు కాపాడి సివిల్ ఆసుపత్రికి తరలించారు.

Woman Locked Inside Toilet For Over A Year By Husband, Rescued: Police
Author
Hyderabad, First Published Oct 15, 2020, 11:49 AM IST

ఓ వ్యక్తి కట్టుకున్న భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దాదాపు సంవత్సరం పాటు భార్యను టాయ్ లెట్ లో బంధించాడు. ఈ దారుణ సంఘటన హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా రిష్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  రిష్పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు పదిహేడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఆమెకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. అయితే.. ఆమె గతేడాది మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో.. ఆమెను భర్త టాయ్ లెట్ లో బంధించాడు.  దాదాపు సంవత్సరం పాటు ఆమెను టాయ్ లెట్ లో బంధించడం గమనార్హం.

భర్తే ఏడాదిపాటు మరుగుదొడ్డిలో బంధించాడని తెలిసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో బలహీనంగా ఉన్న మహిళను అధికారులు కాపాడి సివిల్ ఆసుపత్రికి తరలించారు. భార్యకు మానసిక ఆరోగ్యం ఉందని ఆమెను భర్త మరుగుదొడ్డిలో వేసి తాళం వేసి ఏడాదిపాటు బంధించాడు. దీనిపై మహిళా రక్షణ అధికారి రజనీగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్డిలో దయనీయమైన పరిస్థితుల్లో పడుకున్న మహిళను అధికారులు కాపాడారు. బాధిత మహిళ బలహీనంగా ఉందని, నడవలేకపోయిందని, ఆమెకు ఆహారం ఇచ్చామని గుప్తా చెప్పారు. 

బందీఖానాలో బాధత మహిళకు సరైన ఆహారం, తాగునీరు కూడా ఇవ్వలేదని అధికారులు చెప్పారు. బాధిత మహిళకు 17 సంవత్సరాల క్రితం నరేష్ కుమార్ తో వివాహం అయిందని, వారికి 15,11,13 సంవత్సరాల వయసు గల పిల్లలున్నారని అధికారులు చెప్పారు. 

తన భార్యకు మానసిక ఆరోగ్య సమస్య ఉందని భర్త నరేష్ కుమార్ చెబుతున్నా, బాధితురాలు కుటుంబసభ్యులందరినీ గుర్తించారని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని అధికారులు చెప్పారు. భార్యను బంధించిన భర్త నరేష్ కుమార్ పై ఐపీసీసెక్షన్ 498 ఏ, 342 కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి సురేందర్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios