పూణే: ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్తను చంపేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పూణేకు చెందిన తన మయూర్ గ్వైక్వాడ్, రితుకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. భర్తను వదిలేసి ప్రియుడి దగ్గరకు వెళ్తానని రితు తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వారు సర్దిచెప్పి భర్త వద్దనే ఉండాలని చెప్పారు. 

అయితే, తరుచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో రితు వేరే వ్యక్తితో మాట్లాడడం గమనించిన భర్త గైక్వాడ్ ఆమెను మందలించాడు. దాంతో ప్రియుడి కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆమె పథకరచన చేశింది. 

నర్సు ఉద్యోగం చేసే గైక్వాడ్ తల్లి నైట్ డ్యూటీకి వెళ్లిన తర్వాత భర్తను చంపాలని రితు పథకం వేసింది. సంఘటన జరిగినప్పుడు మృతుడి సోదరుడు కూడా ఇంట్లో లేడు. బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో రితు భర్తను హత్య చేసింది. ఏమీ తెలియనట్లు ఇంటి వెలుపలికి వెళ్లిపోయింది. 

మయూర్ గైక్వాడ్ రక్తం మడుగులో పడి ఉన్న విషయాన్ని సోదరుడికి ఫోన్ చేసి చెప్పారు. ఇంటికు చేరుకున్న సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాను మార్నింగ్ వాక్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భర్త చనిపోయి ఉన్నాడని రితు చెప్పంది. ప్రియుడి కోసమే తాను ఈ హత్య చేసినట్లు రితు విచారణలో అంగీకరించింది.