కర్ణాటకలోని బసశంకరిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యే సొంత కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపింది. ఈ దారుణం బెళగావి జిల్లా చింకోళి వద్ద వెలుగు చూసింది. హతుడు కుమార రాముఖోత(39).  అతని భార్య గీత. ఆమెకు బాలేశ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. 

ఈ విషయం తెలిసిన భర్త ఆ సంబంధం మానుకోవాలని అనేకసార్లు హెచ్చరించాడు. అయినా గీత దాన్ని పెడచెవిన పెట్టింది. బాలేషతో సంబంధం కొనసాగించింది. 

రోజురోజుకు రాము హెచ్చరికలు ఎక్కువవుతుండడంతో అతన్ని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేసింది. దీనికోసం ప్రియుడు, కొడుకు సచిన్, మరో ఇద్దరితో కలిసి పథకం వేసింది. దీని ప్రకారం గత నెల 27న భర్తకు మద్యం తాగించింది. ఆ తరువాత మత్తులోకి వెళ్లిన అతని తలమీద బండరాయితో కొట్టి చంపింది. 

కోడలిని రూ. 80 వేలకు అమ్మేసిన మామ: 300 మహిళలతో వ్యాపారం...

శవాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి దగ్గర్లోని కృష్ణా నదిలో పడేశారు. ఆ తరువాత శవం దొరకడంతో భర్తను ఎవరో దుండగులు చంపేశారని ఏడవసాగింది. దీంతో కుడచి పోలీసుల విచారణలో బండారం బట్టబయలయ్యింది. మంగళవారం మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు.