రూ.2వేల నోటు కోసం ఓ మహిళ ప్రాణాలను పణంగా పెట్టింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రోస్టేషన్‌లో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. నోయిడావైపు వెళ్తున్న మెట్రో రైలు ద్వారకామోర్ స్టేషన్ ఫ్లాట్‌ఫాం దగ్గర నిలిచే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒక మహిళ రూ.2000నోటు ట్రాక్‌పై పడడంతో తీసుకునేందుకు ట్రాక్‌పై దూకింది. ఇదే సమయంలో మెట్రో రైలు రావడంతో ఆమె ట్రాక్ మధ్యలో రైలు కింద పడిపోయింది. అయితే వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది ఆ మహిళను సురక్షితంగా కాపాడారు.ఈ సమయంలో కొన్ని బోగీలు కూడా ఆమె పై నుంచి వెళ్లాయి.

ట్రాక్‌లు మధ్య ఇరుక్కోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. మహిళను కాపాడిన వెంటనే ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ సమయంలో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళను ఢిల్లీకి చెందిన జచరియాకోషీగా గుర్తించారు.

తనని కష్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు ఆమె ప్రమాదవశాత్తు పడిననట్లు తెలుసుకుని, మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకుగాను ఆమె చేత క్షమాపణ లెటర్‌ను రాయించారు. అనంతరం  ఆమెను ఇంటికి పంపేశారు.