భర్తకు తెలియకుండా ఓ మహిళ.. మరో ఇద్దరు పురుషులతో అక్రమసంబంధం పెట్టుకుంది.

భర్తకు తెలియకుండా ఓ మహిళ.. మరో ఇద్దరు పురుషులతో అక్రమసంబంధం పెట్టుకుంది. తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న మొదటి ప్రియుడు ఆమెపై కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బెళత్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్‌ (28) భార్య మంజుళ. వీరికి ఇద్దరు పిల్లలు. మంగళవారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్న మంజుళను అడ్డగించిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు కోసి, కడుపులో పొడిచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడ్ని చూడాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయి. మంజుళాకు చూడాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజశేఖర్‌ (35)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో బాగలూరు కోట ప్రాంతానికి చెందిన సురేశ్‌తో మంజుళకు పరిచయం ఏర్పడింది. ఇది సహించని రాజశేఖర్‌ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఆవేశం చెందిన అతడు ఆమెపై కత్తితో దాడి చేసినట్లు తెలిసింది.