Asianet News TeluguAsianet News Telugu

అమానుషం : కోడలు ఉరేసుకుంటుంటే.. వీడియో తీసిన అత్తామామలు.. ఆపై..

కోడలు గదిలో ఉరేసుకుంటుంటే.. కిటికీలోనుండి అత్తామామలు వీడియో తీసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు మరో యువతి ప్రాణాలు తీసింది. బాధితురాలు తనంతట తానే ఉరేసుకుని చచ్చిపోయేలా ప్రోత్సహించి మరీ అత్తామామలు ఆమె మరణానికి కారణమయ్యారు. 

Woman hangs herself, in-laws make video  - bsb
Author
Hyderabad, First Published Apr 13, 2021, 1:18 PM IST

కోడలు గదిలో ఉరేసుకుంటుంటే.. కిటికీలోనుండి అత్తామామలు వీడియో తీసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు మరో యువతి ప్రాణాలు తీసింది. బాధితురాలు తనంతట తానే ఉరేసుకుని చచ్చిపోయేలా ప్రోత్సహించి మరీ అత్తామామలు ఆమె మరణానికి కారణమయ్యారు. 

తనంతట తానే ఉరివేసుకుంది.. తమ తప్పేం లేదు.. అని నిరూపించుకోవడానికే అత్తామామ, భర్త, మరిది ఈ వీడియో తీసినట్టుగా తేలింది. వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ దారుణం జరిగింది. వీడియో చిత్రీకరించిన అత్తామామలు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో పోలీసులు అత్తామామల్ని అరెస్ట్ చేశారు. భర్త ఆశిష్, మరిది పరారీలో ఉన్నారు. మృతురాలు కోమల్ తల్లిదండ్రుల కథనం మేరకు భర్త, అత్తామామలు ఆమెను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. 

ఈ వీడియోలో కోమల్ ఉరివేసుకోవడానికి రెడీ అవ్వడం కనిపిస్తుంది. అత్తామామలు గది బయట కిటికీలోనుంచి చూస్తున్నారు. ఆస్ బెస్టాస్ పై కప్పులు ఉరితాడు సిద్ధం చేసుకోవడం, ఆ సమయంలో కోమల్ గట్టిగా శ్వాస తీసుకోవడం కనిపిస్తుంది. అంతేకాదు తాడు మధ్యలో ఊడిపోకుండా గట్టిగా ఉందా, తన మెడకు సరిపోతుందా లేదా అని కూడా పరీక్షించుకుంది. 

ఆ తరువాత స్టూలు మీదికి ఎక్కి, మెడకు తాడు తగిలించుకుని స్టూల్ ను తన్నేసింది. ఆ సమయంలో ఓ మగ గొంతు ఆమెంతట ఆమెనే ఉరి వేసుకుంది.. అని అనడం వినిపిస్తుంది. అది కోమల్ మామ గొంతు అయుంటుందని పోలీసులు అంటున్నారు. 

ఇది ఖచ్చితంగా కోమల్ ఉరివేసుకున్న గది బైటినుంచే తీసిందేనని, వారు ఆమెను ఉరివేసుకోకుండా ఆపలేదని పోలీసులు అంటున్నారు. 

కోమల్ తల్లిదండ్రుల కథనం మేరకు... కోమల్, ఆశిష్ లకు 2019 సెప్టెంబర్‌లో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల రూపాయలు, ఒక బండి వరకట్నం కింద ముట్టజెప్పారు. అయితే ఈ విషయంలో ఆశిష్ తండ్రి  దేవేంద్ర, తల్లి సవిత, సోదరుడు సచిన్ లు పెద్దగా సంతృప్తిగా లేరు.

ఆర్నెళ్ల కిందటి నుంచి కోమల్ కు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం  తేవాలని కోమల్‌ను కొట్టి ఇంటి నుండి తరిమికొట్టారు. గ్రామపెద్దలు కలగజేసుకుని సర్థిచెప్పి పంపించారని కోమల్ తండ్రి అనిల్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా  రెండు నెలల క్రితం వారు 1.2 లక్షలు తేవాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అడిగిన కట్నం ఇవ్వకపోతే ఆశిష్ కు వేరే పెళ్లి చేస్తామని బెదిరించారు. అత్తామామ, భర్త, మరిది నలుగురూ కలిసి నా కుమార్తెను చంపారు.. అని ఆయన చెప్పారు.

పీటీసార్ నిర్వాకం : విద్యార్థినిని ఎత్తుకుపోయి పెళ్లిచేసుకుందామనుకున్నాడు.. కానీ..

ఆశిష్, అతని సోదరుడు, అతని తల్లిదండ్రులపై 304 బి (వరకట్న మరణం), 498 ఎ (వివాహిత మహిళపై క్రూరత్వం), ఐపిసి యొక్క 506 (క్రిమినల్ బెదిరింపు),  సెక్షన్ 3 (కట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం), 4 (కట్నం డిమాండ్) ) వరకట్న నిషేధ చట్టంలా కింద కేసులు నమోదు చేశారు.

"తల్లిదండ్రులను అరెస్టు చేశాం.  ఆశిష్, అతని సోదరుడు సచిన్ పరారీలో ఉన్నారు, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తాం" అని ఛాపర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ యశ్‌పాల్ సింగ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios