Asianet News TeluguAsianet News Telugu

‘ఎఫైర్ ఉన్నంత మాత్రాన చెడ్డతల్లి కాదు’.. పంజాబ్ కోర్టు సంచలనం..

చెడ్డ మహిళ ఉంటుంది కానీ, చెడ్డ తల్లి ఉండదని పెద్దలమాట. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. సమాజం హర్షించనప్పటికీ బిడ్డల బాగు కోసం ఆమె ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది. తాజాగా పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది.  వివాహేతర సంబంధం ఉన్నత మాత్రాన ఒక మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేం అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా నాలుగున్నరేళ్లు కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది.

woman extramarital affair can't define her as a bad mother : punjab HC - bsb
Author
Hyderabad, First Published Jun 3, 2021, 4:34 PM IST

చెడ్డ మహిళ ఉంటుంది కానీ, చెడ్డ తల్లి ఉండదని పెద్దలమాట. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. సమాజం హర్షించనప్పటికీ బిడ్డల బాగు కోసం ఆమె ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది. తాజాగా పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది.  వివాహేతర సంబంధం ఉన్నత మాత్రాన ఒక మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేం అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా నాలుగున్నరేళ్లు కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది.

వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ భర్త తన దగ్గర్నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో పంజాబ్ కు చెందిన ఓ మహిళ హెబియస్‌ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీని  విచారణ సందర్భంగా జస్టిస్ అనుపిందర్‌ సింగ్‌ గ్రెవాల్‌ మాట్లాడుతూ ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావం పై నిందలు మోపడం చాలా సహజం. ఎలాంటి ఆధారం లేకుండా మహిళ వ్యక్తిత్వం పై బురద జల్లుతారు. స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా... ఉందని ఊహించినా... దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను మంచిది కాదని అనడానికి కానీ, పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదు.’ అని స్పష్టం చేశారు.

కేసు వివరాల్లోకి వస్తే... పిటిషనర్ పంజాబ్ కు చెందిన ఫతేగార్‌ సాహిబ్‌, లుధియానా కు చెందిన ఆమె భర్త ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరులే.  2013లో వీరికి వివాహం కాగా, 2017 లో కుమార్తె జన్మించింది. పిటిషన్ దారైన మహిళ 2020, ఫిబ్రవరిలోఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడడానికి వచ్చినపుడు ఆమె దగ్గర్నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు.

ఈ క్రమంలో సదరు మహిళ తన భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... కానీ తాను మాత్రం ఆస్ట్రేలియాలో బాగానే స్థిరపడ్డారని సొంత ఇల్లు కూడా ఉందని కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పిటిషన్లో తెలిపింది. మైనర్ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.

ప్రియురాలి కోసం వధువులా మారిన ప్రియుడు..!...

అంతేకాక సదరు మహిళ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుమార్తె కస్టడీని కోర్టు ఫెడరల్‌ సర్క్యూట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది. ఇక భర్త వాదనల ప్రకారం అతని భార్య తన దగ్గర బంధువు తో వివాహేతర సంబంధం పెట్టుకుందని... అందుకే ఆమె దగ్గర నుంచి తీసుకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు.

ఏడాదిగా తన కుమార్తె నాన్నమ్మ, తాతయ్యల దగ్గర బాగా అలవాటయిందని, ఇప్పుడు బిడ్డను తన భార్య అప్పగిస్తే పాప పై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు ‘తల్లి నాలుగున్నరేళ్లు కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరుతుంది.రానున్న సంవత్సరాల్లో పాపా నిర్మాణాత్మక అభివృద్ధిలో తల్లిప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, మార్గదర్శకత్వం అవసరమవుతాయి. అంతేకాక మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం, 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి ఐదేళ్ల వయసు వరకు పిల్లల సహజ సంరక్షకురాలు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios