Asianet News TeluguAsianet News Telugu

సొంత కారు ఢీకొని మరణించిన యువతి.. పార్కింగ్‌లో దుర్ఘటన

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. 22 ఏళ్ల యువతి పార్కింగ్‌లోని తన సోదరి కారును కొంత పక్కకు పార్క్ చేసి మరో వాహనం కోసం స్పేస్ ఉండేలా చేయాలని అనుకున్నది. ఆ కారు ఎక్కి అలాగే పక్కన పార్క్ చేసింది. కానీ, ఆ ఎస్‌యూవీ కారుకు ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ ఉన్నది. అది యాక్టివేట్ కాలేదు. కానీ, ఆమె అది పట్టించుకోకుండా కారు నుంచి దిగి దాని వెనుకకు వచ్చి నిలబడింది. హ్యాండ్ బ్రేక్ పడకపోవడంతో ఆ కారు పార్కింగ్ నుంచి వేగంగా వెనక్కి దూసుకొచ్చింది. ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె మరణించింది.
 

woman died by hitting own car in australia
Author
New Delhi, First Published Jan 14, 2022, 12:38 AM IST

న్యూఢిల్లీ: ఓ యువతి తన సొంత కారు(Own Car) వల్లే ప్రాణాలు కోల్పోయారు. పార్కింగ్ ఏరియా(Parking) నుంచి కారు వెనక్కి వస్తుండటాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ కారు యువతిని బలంగా ఢీకొట్టింది. అంతే.. ఆమె తన ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆస్ట్రేలియా(Australia)లోని అడిలైడ్‌లో జరిగింది. ఆమె మరణంపై ఇరుగుపొరుగు వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే.. ఆమె అందరితోనూ చాలా కలివిడిగా ఉంటూ అవసరమైన సహాయం చేస్తూ గడిపేది. తన కోసం కాకుండా.. ఇతరుల కోసం ఎక్కువగా పరితపించిపోయేది. ఆమె మరణంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

దక్షిణ అడిలైడ్‌లో హ్యాపీ వ్యాలీలోని ఇంటిలో బ్రియానా జోన్స్ తన సోదరితో కలిసి ఉన్నది. జనవరి 6వ తేదీన సోదరితో కాలం గడుపుతూ ఇంటిలోనే ఉన్నది. ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తుండటాన్ని ఆమె చూసింది. ఆయన కారు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ కోసం.. అక్కడ పార్కింగ్‌లో ఉన్న ఆమె సోదరి కారును పక్కన పెట్టడానికి బయటికి వెళ్లింది. కానీ, అక్కడ పార్క్ చేసిన ఉన్న ఎస్‌యూవీ కారు వేగంగా వెనక్కి వచ్చి ఆమెను ఢీకొంది. బ్రియానా జోన్స్ ఆ కారు ఎక్కి.. ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్‌ను వేయకుండా దిగి ఉంటుందని, దీంతో ఆ కారు వేగంగా వెనక్కి వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

బ్రియానా జోన్స్ తండ్రి డేనియల్ జోన్స్ ఈ ఘటనపై రోదిస్తూ మాట్లాడాడు. తన కూతురికి మంచి హృదయం ఉన్నదని, ఎప్పుడూ పరుల పట్లే ఆలోచించేదని వివరించారు. ఆమె అనేక నాడీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఆమె గురించి కాకా ప్రపంచంలోని ఇతరుల కోసమే ఆమె పని చేసేదని తెలిపారు. ఇతరులకు సేవ చేయడంలోనే సంతోషాన్ని వెతుక్కునేదని పేర్కొన్నారు. ఆమె తన జీవిత కాలానికి సరిపడే ప్రేమను పొందిందని వివరించారు. ఆమె తన జీవిత ప్రమాణాలు క్షీణిస్తున్నా.. దినదినం ఆరోగ్య తరిగిపోతున్నా.. వాటిని ఎప్పుడూ తన చిరు నవ్వు వెనుకాల కప్పి ఉంచేదని పేర్కొన్నారు. ఆమె మరణం తమ కుటుంబంలో చీకటి నింపిందని వివరించారు. అయితే, ఆమె ఇక నుంచి ఆరోగ్య సమస్యలతో తల్లడిల్లదని తెలిసి కొంత ఉపశమనం పొందుతున్నామనీ బాధాతప్త హృదయంతో చెప్పారు.

గుజ‌రాత్ లోనూ గత శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం వారిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ప్రాణాలు నిలుపుకోవ‌డం కోసం పోరాడుతున్నారు. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా పట్టణం సమీపంలో గుర్తుతెలియని వాహనాన్ని మినీవ్యాన్ ఢీ  కొట్టింది ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్ల‌డించారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. వారు ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతున్నారు. శనివారం అర్థరాత్రి వ్యాన్ లో  ప్రయాణికులు వడోదర నుంచి బొటాడ్ జిల్లాలోని ఒక దేవాలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళుతుండగా రాష్ట్ర రహదారిపై ఈ road accident జరిగిందని ధోల్కా టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios