ఈ విషయం కాస్త భర్తకు తెలిసిపోయింది. దీంతో.. భర్త ఆమెను ఈ విషయంలో నిలదీశాడు. 

భర్తకు తెలీకుండా ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కాగా.. ఈ విషయం కాస్త భర్తకు తెలిసిపోయింది. దీంతో.. భర్త ఆమెను ఈ విషయంలో నిలదీశాడు. అంతే.. భర్త తనను అలా నిలదీయడంతో.. అవమానంగా భావించి సదరు వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బాగలూరు సమీపంలోని దాసరపల్లిదిన్న ప్రాంతానికి చెందిన సురేష్ భార్య ఆనందమ్మ(35)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం కాస్త భర్తకు తెలిసిపోయింది. దీంతో.. ఆవేశంగా భార్యను ఈ విషయంలో నిలదీశాడు. తనను ఎందుకు మోసం చేశావంటూ ఆమెపై మండిపడ్డాడు. దీంతో ఆమె సోమవారం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అవమాన భారం తట్టుకోలేక.. తాను తప్పు చేశాననే విషయం ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.