Asianet News TeluguAsianet News Telugu

మహిళ మృతదేహం లభ్యం.. పోస్టుమార్టంలో పురుషుడి మృతదేహంగా.. అందరూ షాక్.. ఏమైందంటే?

ఉత్తరప్రదేశ్‌లో ఓ డెడ్ బాడీని గుర్తించడంలో పోలీసులు పొరబడ్డారు. కుళ్లిన స్థితిలో ఉండటంతో ఆనవాళ్లను బట్టి ఆ డెడ్ బాడీ మహిళదని అనుకున్నారు. కానీ, పోస్టుమార్టం చేసిన వైద్యులు షాక్ అయ్యారు. అది పురుషుడిదని వారు తేల్చారు.
 

woman body turns out to be man while performing post mortem kms
Author
First Published Sep 7, 2023, 7:54 PM IST

లక్నో: చేతులు, కాళ్లు కట్టేసి కుళ్లిపోయిన స్థితిలో ఓ డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఆ మృతదేహం ఎక్కువగా కుళ్లిపోయి ఉండటంతో గుర్తుపట్టే స్థితిలో లేదు. ఆ డెడ్ బాడీ కుర్తా పైజామాలో ఉన్నది. పొడవైన తల వెంట్రుకలు. పోలీసులు అది ఓ మహిళ డెడ్ బాడీ అనుకున్నారు. కానీ, పోస్టుమార్టం గదిలో అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం చేస్తుండగా.. పోలీసులు చెప్పినట్టు అది మహిళ మృతదేహం కాదని వైద్యులకు తెలియవచ్చింది. దీంతో వారు షాక్ అయ్యారు. పోస్టుమార్టం ఆపేశారు. పోలీసులు అది పురుషుడి మృతదేహం అని చెబితేనే పోస్టుమార్టం చేస్తామని స్పష్టం చేశారు. దీంతో 72 గంటలపాటు ఆ డెడ్ బాడీ మోర్గ్‌లోనే ఉండిపోయింది.

యూపీలోని బస్తి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ సంచిలో నుంచి తీవ్రమైన దుర్గంధం వచ్చింది. దీంతో స్థానికుల్లో అనుమానాలు వచ్చాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆదివారం ఆ సంచి వద్దకు వెళ్లి చూశారు. అందులో డెడ్ బాడీ ఉన్నది. నీటిలో మునిగిపోయి తేలడం మూలంగా ఆ డెడ్ బాడీ విపరీతంగా వాపుతో ఉన్నది. పైగా కుళ్లిపోయి ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది.

Also Read: భార్యకు జాబిల్లిని గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. చంద్రుడిపై ఎకరం కొన్నట్టు వెల్లడి.. అసలేం జరిగింది?

పొడవైన తల వెంట్రుకలు, కుర్తా పైజామాలో డెడ్ బాడీ ఉండటంతో అది మహిళ మృతదేహమేనని పోలీసులు అనుకున్నారు. ఆ తర్వాత డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. డాక్టర్లు పోస్టుమార్టం చేస్తూ ఉండగా.. ఆ డెడ్ బాడీ పురుషుడిదని తెలిసింది. పోలీసులు మహిళ అని రిపోర్టు చేయడంతో వైద్యులు ఖంగుతిన్నారు.

పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ డెడ్ బాడీ పురుషుడిదని రిపోర్ట్ చేసిన తర్వాత పోస్టుమార్టం చేశారు. ఆ డెడ్ బాడీ ఒక పురోహితుడిదని, మెడ చుట్టూ తాడుఉండటంతో ఉరి వేసి చంపేశారేమోననే అనుమానాలు ఉన్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios