తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని అత్యంత దారుణంగా హతమార్చి, సూట్ కేసులో కుక్కి.. డ్రైనేజీ కాలువలో పడేశారు. దాన్నుండి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు.
తిరువొత్తియూరు : Tiruppur లోని తారాపురం రోడ్డు పక్కన ఓ Drainage కాలువలో suitcaseలో కుక్కిన యువతి dead body పడి ఉండటం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలు... డ్రైనేజీ కాలువలో ఆదివారం సూట్ కేసు పడి ఉండడం... అందులో నుంచి తీవ్రంగా దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికులు గమనించి.. వీరపాండి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
ఇన్స్పెక్టర్ ఆనందన్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకొని సూట్ కేసును తెరిచి చూడగా.. అందులో 30 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువతి ఎవరు? ఎందుకు చంపారు? సూట్ కేసులో పెట్టి.. ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు పడేశారు? అనే విషయాల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గుర్తు తెలియని యువతి మృతదేహం, మర్డర్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రేమ వ్యవహారమా? అక్రమ సంబంధమా? వేరైదైనా కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, నిరుడు జూన్ లో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కట్టుకున్న భార్యనే అత్యంత పాశవికంగా హతమార్చి.. సూట్ కేసులో కుక్కి హత్య చేశాడో భర్త. ‘నీ తీరు మార్చుకుంటే సరే.. లేకపోతే నువ్వు మాకు అవసరం లేదు. నేను, పాప నా జీతంతో సంతోషంగా బతుకుతాం’ అని భార్య చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో జూన్ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్ కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అవినీతి నిర్మూలన పేరిట ఓ సంస్థను స్థాపించాడు.
రూ. 90 వేలు జీతం తీసుకునే భార్యను వేధించేవాడు. ఆమె జీతం విలాసాలకు ఖర్చు చేసేవాడు. ఆమె బంధువులు, స్నేహితుల ద్వారా రూ.లక్షల్లో అప్పు తీసుకుని తనను తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో తీరు మార్చుకోవాలని భర్తకు సూచించింది.
ఇక తన ఆటలు సాగవని భావించిన శ్రీకాంత్ రెడ్డి ఈనెల 22న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నిద్ర పోతున్న భార్య ముఖం మీద దిండు అదిమి హతమార్చాడు. అదే రోజు మధ్యాహ్నం ఓ సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కి ట్యాక్సీలో రుయా ఆస్పత్రి ప్రాంగణంలోకి తీసుకెళ్లాడు.
అక్కడ భార్య మృతదేహానికి నిప్పు పెట్టాడు. మరుసటి రోజు కాలిన మనిషి అవశేషాలు వెలుగులోకి రావడంతో కూతుర్ని రామసముద్రం లోని అమ్మమ్మకు అప్పగించి పరారయ్యాడు. చివరకు మృతురాలి అక్క కుమార్తె అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
