భర్త చేతిపై పచ్చబొట్టు.. ఉతికి పారేసిన భార్య

Woman beats up husband over tattoo of a girl’s name
Highlights

ఇంతలో భర్త చేతిపై ఓ పచ్చబొట్టు కనిపించింది. అది ఓ అమ్మాయి పేరు. ఆ పేరు ఎవరిదా అని ఆరా తీస్తే.. మనోడికి గతంలో ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని తేలింది. ఈ విషయం తెలియగానే భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. 

ఎంతో ముచ్చటపడి ఓ వ్యక్తి వేయించుకున్న పచ్చబొట్టు.. వాళ్ల కాపురంలో చిచ్చు రేపింది. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా భార్య.. నడిరోడ్డు పై భర్త దుమ్ముదులిపి వదిలిపెట్టింది. అందుకు కారణం ఏంటో తెలుసా..? భర్త చేతిపై పచ్చబొట్టే.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మెట్టుపాళయంకు చెందిన ఈ జంటకు ఇటీవల వివాహం ఘనంగా జరిగింది. రెండు రోజుల క్రితం ఇద్దరూ బయటకెళ్లేందుకు బస్టాప్‌లో వెయిట్ చేస్తున్నారు. ఇద్దరూ పక్కపక్కనే నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో భర్త చేతిపై ఓ పచ్చబొట్టు కనిపించింది. అది ఓ అమ్మాయి పేరు. ఆ పేరు ఎవరిదా అని ఆరా తీస్తే.. మనోడికి గతంలో ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని తేలింది. ఈ విషయం తెలియగానే భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. 

భర్త చొక్కా పట్టుకున్న భార్య చెంప చెళ్లుమనిపించింది. జుట్టు పట్టుకొని నాలుగు పీకింది. కిందపడేసి చెడామడా వాయించింది. చుట్టూ ఉన్న జనం ఇదంతా చూసి షాకయ్యారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది. 

loader