Gang Rape In Delhi: ఢిల్లీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఓ మహిళను మహిళ జుట్టు కత్తిరించి, ముఖాన్ని నల్లగా మార్చి, చెప్పుల దండను మెడలో వేసి వీధుల్లో తిప్పారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
Gang Rape In Delhi: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కస్తూర్బా నగర్‌లోని వివేక్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన 20ఏళ్ల యువతిపై కొందరు మహిళలు దాడి చేసి చిత్ర హింసలకు గురిచేశారు. ఆ యువతికి జట్టు కత్తిరించి.. ముఖానికి నల్ల రంగు రుద్దారు. ఆపై యువతి మెడలో చెప్పులదండ వేసి.. వీధిలో ఊరేగించారు. ఈ తరుణంలో విక్షణ రహితంగా యువతిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఈ పోస్టును రీట్విట్ చేశారు. ఇది ఎంతో సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించేలా పోలీసులకు ఆదేశిలివ్వాలని హోంమంత్రి అమిత్‌షా, దిల్లీ గవర్నర్‌ను కోరారు.
ఈ ఘటనపై మహిళ చెల్లెలు పోలీసులకు సమాచారం అందించింది. అక్రమంగా మద్యం అమ్మేవాళ్లు యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆమె సోదరి ఆరోపించారు. నవంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ మహిళకు కౌన్సెలింగ్ జరుగుతోంది. బాధితురాలిని కొట్టుకుంటూ ఊరేగించిన మహిళల్ని కూడా అరెస్టు చేయాలని బాధితురాలి సోదరి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. యువతిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తుల్ని బుధవారమే అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితురాలిపై ఉన్న వ్యక్తిగత కక్ష్యతోనే మహిళలు యువతిపై దాడి చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ సత్య సుందరం స్పష్టం చేశారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. బాధితురాలిని మెరుగైన చిక్సిత అందించమనీ, సంరక్షణ కల్పించమని తెలిపారు.
