Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ రికార్డు సృష్టించిన ఢిల్లీ వైద్యులు .. అత్యంత వేగవంతంగా హిప్ బాల్ రీప్లేస్‌మెంట్ సర్జరీ .. 

దేశ రాజధాని ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రికి చెందిన వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అత్యంత వేగవంతంగా హిప్ బాల్ రీప్లేస్‌మెంట్ సర్జరీ కేవలం 15 నిమిషాల 35 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రి శనివారం ప్రకటించింది.   

With Hip Replacement In 15 Minutes, Delhi Doctors Claim New World Record
Author
First Published Jan 15, 2023, 4:28 AM IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రికి చెందిన వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీని నిర్వహించినట్లు ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రి శనివారం ప్రకటించింది. కేవలం  15 నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఓఖ్లాకు చెందిన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ వైద్యుల బృందం కేవలం 15 నిమిషాల 35 సెకన్లలో 86 ఏళ్ల రోగికి తుంటి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. అత్యంత తక్కువ సమయంలో ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి.  

ఆసుపత్రి ప్రకారం.. బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన సుమిత్రా శర్మ జారిపడి పడిపోయింది. దీంతో ఆమె తుంటి ఎముక విరిగింది. మూడు రోజుల తర్వాత శర్మను ఢిల్లీకి తీసుకొచ్చారు. శర్మ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, 18 ఏళ్ల క్రితం యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారని ఆసుపత్రి తెలిపింది. ప్రకటన ప్రకారం.. శస్త్రచికిత్సకు ముందు, ఆమెకు యాంజియోగ్రఫీ చేశారు.  మరొక రక్తాన్ని సన్నగా చేసే హిమ్‌పారిన్ కూడా ఇచ్చారు. దీంతో అతని కేసు మరింత క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగికి ఆరోగ్య పరిస్తితి ద్రుష్ట్యా అత్యవసర శస్త్రచికిత్స అవసరమని ప్రకటనలో పేర్కొంది.

డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా నేతృత్వంలోని బృందం 15 నిమిషాల 35 సెకన్లలో తుంటి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది, ఇటువంటి శస్త్రచికిత్సను అతి తక్కువ వ్యవధి నిర్వహించడం ప్రపంచంలోనే తొలిసారి. శస్త్రచికిత్స మునుపటి రికార్డు కంటే మూడు నిమిషాలు తక్కువ పట్టింది. మునుపటి రికార్డు కూడా డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా , అతని బృందం పేరు మీదనే ఉంది. ఆ రికార్డును రెండేళ్ల క్రితం సృష్టించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ కౌశల్ కాంత్  మిశ్రా మాట్లాడుతూ.. తాము ఆమెకు రోబోటిక్ సర్జరీ లాగా పని చేసామనీ, వీలైనంత త్వరగా పూర్తి చేసామని తెలిపారు.ఇది రికార్డ్ సృష్టించడం కాదనీ,రోగి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయవలసి వచ్చిందని తెలిపారు. రోగి డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ థెరపీ , యాంజియోగ్రఫీ కోసం కార్డియాలజిస్టులు హెపారిన్ ఇస్తారు, ఇది సర్జరీ సమయంలో ఎక్కువ రక్తస్రావాన్ని కలిగిస్తుంది. దాదాపు నాలుగైదు రోజులుగా.. పేషెంట్ నొప్పితో బాధపడుతుంది. దీంతో యాంజియోగ్రఫీ తర్వాత గంటలోపు సర్జరీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము. కేవలం  15 నిమిషాల 35 సెకన్లలో శస్త్రచికిత్స చేసామనీ,ప్రస్తుతం  రోగి ప్రమాదం నుండి బయటపడ్డాడని డాక్టర్ మిశ్రా తెలిపారు.

తాను  ఈ రకమైన శస్త్రచికిత్సను 20 నుండి 25 నిమిషాల్లో చేసేవాడినిననీ, చివరి రికార్డు కూడా తన పేరు మీద ఉందనీ, ఇది దాదాపు 18 నిమిషాల రెండు సెకన్లు. కానీ ఈసారి మొత్తం బృందం సిద్ధంగా ఉండటంతో ఆ రికార్డు బ్రేక్ చేశామని తెలిపారు. ఈ సర్జరీలో డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా తన బృందంతో పాటు అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ అనూజ్, కార్డియాలజిస్ట్ టీమ్‌లో డాక్టర్ విజయ్ కుమార్, నర్సింగ్ సిబ్బంది ఈ సర్జరీని విజయవంతం చేశారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios