అమ్మాయిల వర్జినీటి విషయంలో... చాలా మంది అబ్బాయిలు ఫూల్స్ అవుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్. అమ్మాయిల కన్యత్వంపై ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి.. వివాదంలో పడ్డాడు. కాగా..  ఆకామెంట్లపై అందరూ విరుచుకుపడటంతో.. తన పోస్టుని డిలీట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కోల్ కత్తాలోని జాదవపూర్ యూనివర్శిటీలో కనక్ సర్కార్ అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కాగా..రెండు రోజుల క్రితం ఆయన మహిళలను కించపరుస్తూ.. తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ‘అబ్బాయిలు.. సీల్‌ ఊడిన కూల్‌ డ్రింక్స్‌ కొంటారా? అలాంటప్పుడు కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకుంటారు? అబ్బాయిలు కన్యత్వం కలిగిన యువతుల విషయంలో మోసపోతున్నారు. వర్జినిటీ కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లభించే లాభాల గురించి వారికి అవగాహన లేదు. కన్యత్వం కలిగిన అమ్మాయిలు దేవదూతలు’ అంటూ పోస్ట్ చేశాడు.

కాగా.. ఆయన పోస్టుపై విమర్శలు మొదలయ్యాయి. అయితే.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అంటూ బదులిచ్చాడు. అయినా.. విమర్శలు తగ్గకపోవడంతో.. తన పోస్టుని డిలీట్ చేశాడు. ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమిటని నెటిజన్లు విస్తుపోతున్నారు.