Asianet News TeluguAsianet News Telugu

ఇంకో 76 ఏళ్లే పెళ్లిళ్ల కాన్సెప్ట్ .... ఆ తర్వాత ఎలా వుంటుందంటే : ఆసక్తికర సర్వే

మారుతున్న సామాజిక పరిస్థితులు, పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛ భావాలు పెళ్లి అనే భావననే మార్చేస్తున్నాయని... 2100 నాటికి పెళ్లిళ్లు పూర్తిగా అంతరించిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Will marriage become obsolete by 2100 Experts weigh in AKP
Author
First Published Sep 27, 2024, 8:45 PM IST | Last Updated Sep 27, 2024, 8:45 PM IST

పెళ్లి అనే భావన మారిపోతోంది. ఒకప్పుడు పెళ్లి అంటే పవిత్ర బంధం. ఒక్కసారి పెళ్లయితే చావు వరకు కలిసి ఉండాలి. కానీ కాలక్రమేణా పెళ్లిళ్లతో పాటు విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. అక్రమ సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, డేటింగ్,  భార్యల మార్పిడి... ఇలాంటివి ఒకప్పుడు విదేశాలకే పరిమితమైతే ఇప్పుడు మన దేశంలోనూ సర్వసాధారణం అయిపోయాయి. దీనివల్ల మహిళలు స్వతంత్రంగా బతకడానికే ఇష్టపడుతున్నారు. పెళ్లి బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు.

దీనివల్ల ఇంకో 60-70 ఏళ్లలో అంటే 2100 నాటికి పెళ్లి అనే వ్యవస్థే ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకోరనే ఆందోళనకర విషయాన్ని వారు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు నిపుణులు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పెళ్లి వంటి బంధాలు ఎలా మారుతున్నాయి, సామాజిక మార్పులు, పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛ, మారుతున్న లింగ సమానత్వం వల్ల సంప్రదాయ పెళ్లిళ్లు ఎలా అంతరించిపోతున్నాయో ఈ వీడియోలో వివరించారు. ప్రస్తుత యువతరం కెరీర్, వ్యక్తిగత అభివృద్ధి, అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇతర సంబంధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల పెళ్లి అవసరం లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు.

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో మానవ సంబంధాలు మరింతగా మారిపోతాయని, జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల కూడా ప్రజలు పెళ్లి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదని, ముఖ్యంగా మహిళలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారని, పెళ్లి అనే బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అంటే బంధనం, స్వేచ్ఛ ఉండదు, భవిష్యత్తు ఉండదు, కెరీర్ ఉండదు అనే భావనతోనే చాలామంది వున్నారు... దీంతో వీరు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదని, పెళ్లయినా పిల్లల్ని కనడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి పెళ్లి అనేది ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 
ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉండగా.. రానున్న రోజుల్లో ఇందులో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు భవిష్యత్తులో మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. 1950ల నుంచి అన్ని దేశాల్లోనూ జననాల రేటు తగ్గుముఖం పట్టింది. 1950లో జననాల రేటు 4.84 శాతంగా ఉండగా.. 2021 నాటికి అది 2.23 శాతానికి పడిపోయింది. 2100 నాటికి అది 1.59 శాతానికి పడిపోతుందని అంచనా.   

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios