ఓ భర్త తన భార్యను చికెన్ వండమని అడిగాడు. దీనికి ఆ భార్య నిరాకరించింది. మనస్తాపంతో అతను తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్య చికెన్ వండమంటే వండలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన నగరంలోని ప్రేమ్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పవన్, ప్రియాంక అనే దంపతులు ఉండేవారు. పవన్ తాగే అలవాటు ఉంది. దీంతో ఈ విషయం మీద దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ క్రమంలోనే ఓ రోజు పవన్.. భార్య ప్రియాంకను చికెన్ వండమన్నాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పవన్ ఫర్నీచర్ షాపులో పనిచేసేవాడు. ప్రియాంకతో పవన్ కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. అతని మందుతాగే అలవాటు మీద ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి.

వారు ఎంత దూరం వెళతారు? : నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన 8 మంది ముఖ్యమంత్రులపై విరుచుకుపడ్డ బిజెపి...

గురువారం, పవన్ తన కోసం చికెన్ వండమని తన భార్యను కోరగా, దానికి ప్రియాంక నిరాకరించింది, అప్పటికే రాత్రికోసం వంట చేసేశానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయింది. అది కాస్తా శారీరక హింసగా మారి.. చివరికి పవన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైంలో ప్రియాంక వేరే గదిలో నిద్రపోయింది.

కొన్ని గంటల తర్వాత మృతుడి అన్నయ్య వచ్చి పరిశీలించగా పవన్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి ఇంటి తలుపులు ఎన్నిసార్లు కొట్టినా ఎవరూ సమాధానం చెప్పలేదని పవన్ సోదరుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత తన కూతురిని కిటికీలోంచి గదిలోకి చూడమని అడిగాడు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా పవన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.