లక్నో: భర్త వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ ప్రాంతంలో ఆదివారం వెలుగు చూసింది. మీర్జాపూర్ ప్రాంతంోలని కుట్లుపూర్ గ్రామానికి చెదిన పాన్ దేవి అనే మహిళ భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

ఆ విషయం తెలిసి పాన్ దేవి తీవ్ర మనస్తాపానికి గురైంది ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత సమీపంలోని రామ్ గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దాంతో తన కూతురిని నిత్యం వేధిస్తూ వచ్చాడని తండ్రి ఫిర్యాదులో ఆరోపించాడు. పోలీసులు మహిళ భర్త హరిభరణ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.