Asianet News TeluguAsianet News Telugu

Punjab Assembly Election 2022: సీఎం అభ్యర్థిని మీరే ఎన్నుకోండి.. కేజ్రీవాల్ విన్నూత నిర్ణ‌యం

Punjab Assembly Election 2022:  పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి.మరోసారి అధికారం అందుకోవాల‌ని  కాంగ్రెస్‌, బీజేపీ లు ప్ర‌య‌త్నిస్తోంటే..  ప్రజలను ఆకట్టుకునే పనిలో పడిపోయింది ఆమ్‌ ఆద్మీ పార్టీ… ఇప్పటికే పలు ఆకర్షణీయమైన హామీలను కూడా కురిపించారు.. తాజాగా..  పంజాబ్​ ఆమ్​ ఆద్మీపార్టీ (ఆప్​) సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్ర‌క‌టించిన‌.. ప్ర‌జాభీక్షం ప్ర‌కార‌మే అభ్య‌ర్థిని ఫైన‌ల్ చేయ‌నున్న‌ట్టు  అరవింద్‌ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. 

Who will be AAP's CM face in Punjab? Let people decide, says Arvind Kejriwal
Author
Hyderabad, First Published Jan 13, 2022, 4:27 PM IST

Punjab Assembly Election 2022:  మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, పంజాబ్‌, గోవా  రాష్ట్రాల‌కు ఎన్నికలు  మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరు అందుకుంది. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. యూపీలో నాయకులు వల‌స‌ల బాట ప‌ట్టారు. బీజేపీ నుంచి స‌మాజ్ వాదీకి.. స‌మాజ్ వాదీ నుంచి బీజేపీకి నాయకులు మారుతోన్నారు.

ఇక పంజాబ్ లో అయితే, ఎన్నిక‌ల(Punjab Assembly Election 2022) పోరు మాములుగా లేదు. రాష్ట్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకుని.. పీఠం ద‌క్కించుకోవాల‌ని అధికార కాంగ్రెస్, మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్  ప్ర‌య‌త్నిస్తున్నారు. బీజేపీ కూడా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో ఆప్ కూడా ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు పొలిటిక‌ల్ గేమ్ లో పావులు క‌దుపుతోంది. రోజుకో కొత్త వ్యూహాన్ని ఎంచుకుంటుంది. కింగ్ మేక‌ర్ గా నిల‌వనున్నాయ‌ని, ప్రజలను ఆకట్టుకునే పనిలో పడిపోయింది. రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ఈ సారి ఎన్నిక‌లు  ప‌రిస్థితులు చాలా భిన్నంగా ఉండ‌నున్నాయ‌ని పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా, పంజాబ్​ ఆమ్​ ఆద్మీపార్టీ (ఆప్​) సీఎం అభ్యర్థిపై సూచనప్రాయంగా ఒక ప్రకటన చేశారు  పార్టీ జాతీయ కన్వీనర్, అరవింద్‌ కేజ్రీవాల్. పంజాబ్​ సీఎంగా భగవంత్‌ను చేయాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిని ప్రజలే నిర్ణయించాలని కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే సీఎం అభ్యర్థిని నిర్ణ‌యించేలా.. ఓ ఫోన్ నంబర్ ను ఏర్పాటు చేశారు. పంజాబ్ సీఎం ఎవరు కావాలో ఆ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి పేరు చెప్పాలని సూచించారు.

ఈ మేర‌కు 7074870748 నెంబర్ కు ఫోన్ చేసి.. త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించాల‌ని అన్నారు. ఇలాంటి విన్నూత ప్ర‌క్రియ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని కావొచ్చున‌ని.. ఏ పార్టీ కూడా ఈ విధంగా త‌మ తీసుకుని ఉండర‌ని తెలిపారు. ఫోన్ చేసి గానీ, వాట్సాప్ లో మెసేజ్ ద్వారా గానీ ప్రజలు అభిప్రాయం చెప్పొచ్చని తెలిపారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్ల‌డించాల‌ని తెలిపారు. 

వాస్తవానికి ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ఉన్నా ఆయనపై అసంతృప్తి ఉంది. ఈ మేర‌కే కేజ్రీవాల్  ఈ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. భగవంత్ మన్ తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి అని అన్నారు. తాము ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. తలుపులన్నీ మూసేసి నాలుగు గదుల మధ్య సీఎం అభ్యర్థిని నిర్ణయించడం మంచి పద్ధతి కాదంటూ ఆయన కూడా చెప్పారన్నారు.    

ఈ సారి పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆప్ కూడా పాల్గొన‌నున్న‌ది.  మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించి పదేళ్ల తర్వాత తిరిగి అక్కడ అధికారం చేపట్టింది. ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios