బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న భారత మాత దాస్య విముక్తి కోసం ఎంతోమంది తమ సర్వస్వాన్ని ధారపోశారు. తమ ప్రాణాలను అర్పించారు. కానీ పలువురి పోరాటాలు చరిత్రపుటలలో నమోదు కాలేదు. అందులో కొంత మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధులు
బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న భారత మాత దాస్య విముక్తి కోసం ఎంతోమంది తమ సర్వస్వాన్ని ధారపోశారు. తమ ప్రాణాలను అర్పించారు. కానీ పలువురి పోరాటాలు చరిత్రపుటలలో నమోదు కాలేదు. అందులో కొందరు ప్రముఖులు.. ముజఫర్‌నగర్, షామ్లీకి చెందిన రైతు మహిళలు (1857 వేసవిలో) ఆంగ్ల దళాలతో పోరాడేందుకు ఓ బెటాలియన్ గా ఏర్పడ్డారు. ఈ సమయంలో ఢిల్లీలో వలసవాద సైన్యానికి వ్యతిరేకంగా ఒక మహిళ అక్రమ సాయుధ పౌర దళాలకు నాయకత్వం వహించింది. ఆంగ్లేయుల సైన్యంతో పోరాడినందుకు ఓ మహిళ సజీవ దహనమైంది.
వీరు భారత స్వాతంత్ర్య పోరాటంలో అంతగా తెలియని పరాక్రమ సైనికురాలు, కానీ.. వారి శౌర్యం, దేశభక్తి చరిత్ర పుటలలో నమోదు కాలేదు. కస్తూర్బా గాంధీ.. మహాత్మా గాంధీకి అంకితమైన భార్య అని చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా గాంధీ జైలు పాలైనప్పుడు ఆమె చాలా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ఇలా మన చరిత్ర పితృస్వామ్యానికి బలి అయింది.
మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు.. వారి భర్తలు,తండ్రులు లేదా కొడుకుల ద్వారా గుర్తించబడ్డారు. చరిత్రలో వారి పాత్రలు సహాయకురాళ్లుగా దిగజారాయి. మగవారి చరిత్రనే చరిత్రలో ప్రధానంగా లిఖించబడింది. 1857 నాటి మొదటి జాతీయ స్వాతంత్ర్య యుద్ధంలో ఝాన్సీ రాణి, బేగం హజ్రత్ మహల్‌లకు ఆనాటి చరిత్రకారులు తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ఇతర మహిళా విప్లవకారుల పట్ల వివక్ష చూపారు.
ఝాన్సీ రాణితో పాటు ముస్లిం మహిళా స్నేహితురాలు కూడా కలిసి పోరాటం చేసిందని మన చరిత్ర పుస్తకాల్లో చాలా అరుదుగా ప్రస్తావించబడింది. మధ్య భారతదేశానికి గవర్నర్ జనరల్ ఏజెంట్ అయిన రాబర్ట్ హామిల్టన్ 1858 అక్టోబర్ 30న బ్రిటీష్ ప్రభుత్వానికి ఇలా తెలియజేశాడు. “రాణి గుర్రపు స్వారీ చేస్తోంది. ఆమెతో పాటు మరో ముస్లిం మహిళ కూడా స్వారీ చేస్తోంది, ఆమె చాలా ఏండ్లుగా రాణికి సేవకురాలిగా, రక్షకురాలిగా తోడుగా ఉంటుంది. ఇద్దరూ బుల్లెట్ గాయాలతో గుర్రం మీద నుండి ఒకేసారి పడిపోయారు. ఝాన్సీ వద్ద ఫిరంగి దళాలకు మహిళలు నాయకత్వం వహించారు. అలాగే.. మేజర్ జనరల్ హ్యూ రోస్ ఇలా వ్రాశాడు. "మహిళలు మందుగుండు సామగ్రిని అందించడం. సైనికులకు సహాయం చేయడం, ఫక్వీర్లు (ఫకీర్లు), మతోన్మాదులు మగవారిలా ప్రవర్తించమని, పోరాటంలో పాల్గొనమని పోరాట యోధులను ప్రోత్సహిస్తున్నారు. " అని పేర్కొన్నారు.
అదేవిధంగా బేగం హజ్రత్ మహల్ కూడా ఆమె సైన్యంలో మహిళా పోరాట యోధులను నియమించుకున్నారు. 1857లో.. ఝాన్సీ, లక్నోకు దూరంగా ముజఫర్‌నగర్ షామ్లీలో యుద్ధవిద్యపై అవగాహన లేని రైతు మహిళలు తమను తాము సాయుధ సమూహాలుగా ఏర్పాటు చేసుకున్నారు. హిందూ, ముస్లిం మహిళలు అనేక ప్రదేశాలలో ఆంగ్ల సైన్యంపై దాడి చేశారు.షామ్లీ, థానా భవన్‌లను వలస పాలన నుండి విముక్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బీబీ, నూరి, శోభ వంటి మహిళలు యుద్ధభూమిలో వీరమరణం పొందగా, ఈ మహిళల నాయకురాలు అస్ఘరీ బేగం ఆంగ్ల సైన్యం చేత కాల్చివేయబడ్డారు. వందలాది మంది మహిళలను ఉరి తీశారు.
అలాగే.. బ్రిటిష్ రాణికి 29 జూలై 1857న రాసిన ఈ లేఖలో లెఫ్టినెంట్ WSR హోడ్సన్ ఇలా రాశారు. ఢిల్లీలో ఆకుపచ్చ బురఖా ధరించిన ఒక మహిళ ఆంగ్ల సైన్యంతో పోరాడటానికి ప్రజలను ప్రేరేపించింది. ఆమె ఆయుధాలు ధరించి, మాపై తిరుగుబాటు చేయాలని ప్రజలను ప్రేరేపించి, దళాలపై దాడి చేయించింది. ఆమెను ఎదుర్కొన్న సిపాయిలు, ఆమె పౌరుషంతో పోరాడారని, ఆమె ఐదుగురు పురుషుల వలె బలంగా ఉంది. ఆమెను అరెస్టు చేసిన రోజున.. ఆమె గుర్రంపై స్వారీ చేస్తూ మాపై దాడి చేయడంలో తిరుగుబాటుదారులను వ్యూహాత్మకంగా నడిపించింది. మేము ఆమె వద్ద తుపాకీని గుర్తించాం. ఆమె అటు తుపాకీతో, కత్తితో అనేక మంది సైనికులను చంపింది. మన సైనికులే సాక్ష్యమిచ్చారు. హాడ్సన్ దొర.. ఆ అనామక మహిళను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.
జలియన్ వాలాబాగ్ వీరుడు సైఫుద్దీన్ కిచ్లేవ్ భార్య సాదత్ బానో అని చరిత్ర చెబుతోంది. ఆమె వివాహానికి ముందు రచయిత్రి, కవయిత్రి, రాజకీయ కార్యకర్త అని, స్త్రీల హక్కులు, దేశభక్తి, విద్యపై విస్తృతంగా రాశారు. కానీ.. మన చర్రితకారులు ఆమెకు అంతగా ప్రాధ్యానం ఇవ్వలేదు. సైఫుద్దీన్ అరెస్టును నిరసిస్తూ జలియన్‌వాలాబాగ్‌లో ప్రజలు గుమిగూడారనేది అందరికీ తెలిసిన విషయమే అయినా.. సాదత్ బానో పిలుపుతో ప్రజలు వచ్చిన విషయాన్ని చరిత్ర పేజీలు విస్మరించాయి. ఈ ధైర్యవంతురాలైన మహిళ, నిధుల సేకరణ ప్రచారాలకు ముందుండి నాయకత్వం వహించిందని గాంధీజీ స్వయంగా తన కథనాలలో రాశారు . అంటే.. ఆమె ఎంత గొప్పదో మనమే అర్థం చేసుకోవాలి.
అలాగే.. అమ్జాదీ బేగం గురించి భారతదేశంలో దాదాపు ఏ చరిత్ర విద్యార్థికి తెలియదు. వారు ఆమెను మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ భార్యగా తెలుసు. గాంధీ తన ఒక వ్యాసంలో ఆమె తన భర్తకు బహిరంగ వక్తృత్వ కళను నేర్పించగలదా? అని ఆశ్చర్యపోయాడు. కొందరూ మాటలలో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. గాంధీజీ కోసం వ్యాసాలు.. నిధుల సేకరణ ప్రచారం చేసింది. ఆ ప్రచారానికి ఒంటరిగా నాయకత్వం వహించింది. ఈ ధీర వనిత.
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది ఓ మహిళ. ఆమెను హస్రత్ మోహనీ భార్యగా గుర్తిస్తారు. ఆమెనే నిషాత్. ఆమెకు తనదైన గుర్తింపు లేదు. ఆమె భర్త లేకుండా బహిరంగ రాజకీయ సమావేశాలకు హాజరయ్యేవారు. ఆమె వ్యాసాలు రాసేవారు.వైస్రాయ్ వద్దకు ప్రతినిధి బృందాలను నడిపించారు. కాంగ్రెస్ సెషన్‌లో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం చేసిన మొదటి మహిళ.
