పశ్చిమ బెంగాల్  టిఎంసి ఎంపీ నుస్రత్‌ జహాన్‌ పెళ్లిపై రేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ క్రమంలో నుస్రత్‌ జహాన్‌ వ్యవహారంపై బెంగాల్ బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బెంగాల్ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ నుస్రత్ జహాన్ పెద్ద మోసగత్తె.. పెళ్లి కాలేదని చెప్తున్న.. ఆమె నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘ఎంత మోసం..  టిఎంసి ఆమెకు టికెట్ ఇచ్చింది. పార్లమెంట్ సాక్షిగా ఆమె తనకు వివాహం అయిందని ప్రమాణస్వీకారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె తనకు వివాహం కాలేదు అంటుంది. అయినప్పటికీ ఈమె గతంలో సిందూరం ధరించింది. రథయాత్రలో పాల్గొని పూజలు చేసింది. ఎన్నికల్లో గెలిచింది. జనాలను ఎంత మోసం చేసింది..’అంటూ విమర్శించారు.

ఎంపీ ప్రెగ్నెన్సీ వార్తలు.. ఆ కడుపుతో తనకు సంబంధం లేదన్న భర్త..!...

2019లో కోల్కతాలో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ దంపతులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో దిలీప్‌ ఘోష్‌ రథయాత్ర గురించి ప్రస్తావిస్తూ నుస్రత్ జహాన్‌ను నిందించడమే కాక, 2019 లో రిసెప్షన్ కు హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ని కూడా  నిందించారు.

‘వివాహమే చేసుకోలేదని ప్రకటించిన ఓ వ్యక్తి పెళ్లికి మమతా బెనర్జీ ఎలా హాజరయ్యారు. ఆమె తనకు పెళ్లి కాలేదని కానీ నుదుటున సింధూరం ధరిస్తుంది.. ఆమె గర్భవతి అయిందని జనాలు అంటున్నారు. అసలు ఏంటి ఈ మోసం’ అని ఆయన ప్రశ్నించారు. నుస్రత్ జహాన్ బుధవారం వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో  తన వివాహం చట్టబద్ధమైన కాదని టర్కీలో జరిగిన వారి వివాహానికి భారత చట్టంలో గుర్తింపు లేనందున లైవ్-ఇన్ రిలేషన్ మాత్రమే అని తెలిపారు. కొంతకాలంగా నుస్రత్‌ జహాన్‌ నటుడు యష్ దాస్‌గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.