నయా పంజాబ్ ను నిర్మిస్తామని పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్ అన్నారు. బుధవారం ఆయన భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 

న‌యా పంజాబ్ ను నిర్మిస్తామ‌ని పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann) అన్నారు. మంగ‌ళ‌వారం స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ (Khatkar Kalan) గ్రామంలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గం కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నుంది. గత వారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 

పంజాబ్ లో కాంగ్రెస్ (congress), అకాలీదళ్ (Akali Dal), బీజేపీ (bjp)ని వెన‌క్కినెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల్లో గెలుపొందిన అనంత‌రం భ‌గ‌వంత్ మాన్ ఎమ్మెల్యేల‌కు ముఖ్య‌సూచ‌న‌లు చేశారు. క్యాబినేట్ లో స్థానం కోసం రాజ‌ధాని చుట్టూ తిరిగే బ‌దులు.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనే అధిక స‌మ‌యం గ‌డ‌పాల‌ని సూచించారు. ఓట్లు అడిగేందుకు వెళ్లిన అన్ని ప్రాంతాల కోసం ఎమ్మెల్యేలంద‌రూ ప‌ని చేయాల‌ని చెప్పారు. 

భ‌గ‌వంత్ మాన్ మంత్రి వ‌ర్గంలో ఎక్కువ‌గా యువ‌కులే ఉండే అవ‌కాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో సగానికిపైగా మంది 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారు. వీరిలో 48 ఏళ్ల భ‌గ‌వంత్ మన్ కూడా ఒక‌రు. అభ్య‌ర్థులు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ల ప్ర‌కారం గ‌మనిస్తే కొత్త‌గా ఎన్నికైన 61 మంది శాసనసభ్యులు 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు. 117 మంది సభ్యుల అసెంబ్లీలో 52 శాతం ఈ వ‌య‌స్సు వారే ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొత్త‌గా కొలువుదీరే అసెంబ్లీలో అతి చిన్న వ‌య‌స్కురాలిగా ఆప్‌కి చెందిన 27 ఏళ్ల నరీందర్ కౌర్ భరాజ్(Narinder Kaur Bharaj) ఉన్నారు. ఆమె మాజీ మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుడు విజయ్ ఇందర్ సింగ్లా (Vijay Inder Singla)పై 36,430 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భరాజ్‌తో సహా మొత్తంగా కొత్త శాస‌న స‌భ‌లో 13 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఆమ్ ఆద్మీ త‌ర‌ఫున 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 11 మందిలో ఎనిమిది మంది 50 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు గలవారు.

కొత్త మంత్రివర్గంలో బాగా చదువుకున్న సభ్యులు కూడా ఉంటారని భావిస్తున్నారు. 67 మంది ఎమ్మెల్యేలు (అసెంబ్లీలో 57 శాతం) గ్రాడ్యుయేషన్, అంతకంటే ఎక్కువ డిగ్రీలు కలిగి ఉన్నారు, వీరిలో 21 మంది గ్రాడ్యుయేట్లు, 21 మంది పోస్ట్-గ్రాడ్యుయేట్లు ఉన్నారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) పంజాబ్ ఎలక్షన్ వాచ్ ప్రకారం.. 13 మంది మహిళా ఎమ్మెల్యేలలో 11 మంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేశారు. వీరిలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఓడించిన 50 ఏళ్ల న్యాయవాది జీవన్ జ్యోత్ కౌర్ (Jeevan Jyot Kaur) కూడా ఉన్నారు. రీసైక్లింగ్ సానిటరీ ప్యాడ్‌లను ప్రచారం చేయ‌డం వల్ల ‘ప్యాడ్‌వుమన్’ గా ఆమె పేరుగాంచారు. ఆమె త‌న మొట్టమొదటి ఎన్నికల పోరులో రాజకీయ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu)తో పాటు SAD లీడ‌ర్ బిక్రమ్ సింగ్ మజిథియా (ikram Singh Majithia)ను కూడా ఓడించారు.