ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాల హతమారుస్తామంటూ వచ్చిన ఈ మెయిల్ బెదిరింపులు ముంబైలో కలకలం రేపుతున్నాయి. కీలక బీజేపీ నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను పదవులనుంచి తొలగించాలని లేకపోతే చంపేస్తామని.. ముంబై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆఫీసుకు మంగళవారం ఉదయం ఒక ఈ మెయిల్ వచ్చింది. 

అంతేకాదు వీరిద్దరినీ చంపడానికి ఆత్మాహుతి దాడులు చేస్తామని మెయిల్ లో హెచ్చరించారు. ఇందుకోసం 11మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని.. వాళ్లతో యోగీ, షాలకు అంతం చేస్తామని బెదిరించారు. 

వీళ్లను చంపడంతో పాటు ప్రార్థనా మందిరాలు, ఇత‌ర ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లోనూ దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఈ ఈ మెయిల్ ఎక్కడనుంచి వచ్చింది అనే దానిమీద ఇంతవరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.