Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి క్రేజీగా ఉండాలని వధువు అత్యుత్సాహం.. పోలీసుల షాక్

ఆ పెళ్లి వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో.. పోలీసుల కంటపడింది. ఇంకేముంది.. సదరు వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

WATCH Bride Fires Gun In The Air Before Walking On Stage In UP; COVID Norms Also Flouted
Author
Hyderabad, First Published Jun 2, 2021, 7:32 AM IST

తన పెళ్లి చాలా క్రేజీగా ఉండాలని ఓ వధువు ఆశపడింది. తన పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలంటే.. ఏదో ఒకటి క్రేజీగా చేయాలని అనుకుంది. అంతే.. మండపంపై మరికాసేపట్లో వరుడు తాళి కడతాడు అనగా.. చేతిలో తుపాకీ పట్టుకొని గాలిలో కాల్పులు జరిపింది. పెళ్లికి వచ్చినవారంతా కూడా సరదాగా.. ఆమె చేసిన పనిని వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు అదే ఆమె కొంపముంచింది.

ఆ పెళ్లి వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో.. పోలీసుల కంటపడింది. ఇంకేముంది.. సదరు వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ జిల్లా జెత్వారా ప్రాంతానికి చెందిన ఓ ఇంట ఇటీవల పెళ్లితో ఒక్కటైంది. కాగా.. ఆ పెళ్లిలో వధువు.. మండపంపైకి ఎక్కుతూ తన వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని తుపాకీతో కాల్పులు జరిపింది. అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల కంట పడింది.

 

ఈ వీడియో ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు వధువు రూపా పాండేగా గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే తుపాకీ యజమాని, వధువు మేనమామ రామ్ నివాస్ పాండే పై కూడా కేసు నమోదు చేశారు. లైసెన్స్ డ్ తుపాకీ అయినప్పటికీ.. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించినందుకు పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు.

రామ్ నివాస్ తుపాకీ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పెళ్లికి అతిథులు అధిక సంఖ్యలో తరలిరావంపై కూడా మరో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోపెళ్లికి కేవలం 25 మందికి మించి అనుమతి లేదు. దానిని వారు ఉల్లంఘించడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios