ప్రయాగ్ రాజ్ లో సామాజిక్ అధికారత శిబిర్ లో పాల్గొన్న నరేంద్ర మోడీతో ఒక అంధుడు సెల్ఫీ దిగాడు. దివ్యాంగులకు వారికి అవసరమైన ఉపకారాణాలను కూనుక్కునేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం కింద ఆ అంధుడికి ఈ సెల్ ఫోన్ ను అందచేసింది ప్రభుత్వం. 

ఈ కార్యాక్రమానికి హాజరయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అంధుడు తనకు లభించిన స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీ దిగాడు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 27 వేల మంది వృద్ధులకు, వికలాంగులకు ప్రధాని పరికరాలను అందించారు. 

ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ తమ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే విషయాన్నీ ఎల్లప్పుడూ మనుసులో ఉంచుకొని పరిపాలన చేస్తుందని అన్నాడు. 

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా, అనే వాక్కుకు అనుకూలంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రధాని అన్నారు. (ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడడం ప్రభుత్వ బాధ్యత). భారత దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క దివ్యానంగుడు పాలుపంచుకోవాలని మోడీ ఆకాంక్షించారు. 

దాదాపుగా 19 కోట్ల విలువైన పరికరాలను ఈ సందర్భంగా పంచిపీఠినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగానే చాలా మంది మోడీ గొప్పతనాన్ని మెచ్చుకుంటే.... మరికొందరేమో అంధుడూస్మార్ట్ ఫోన్ ని ఎలా వాడతారు అని ప్రశ్నిస్తున్నారు?