Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసి పెళ్లికి వచ్చి... ప్రియుడు చేసిన పని వైరల్ గా మారింది... !

ఓ యువకుడు వధువు దగ్గరికి వెళ్లి స్వీట్ నోట్లో పెడతాడు. ఆమె అది తినడానికి నిరాకరిస్తే చేతిలో పెట్టి.. కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి పోతాడు.

viral video : brides ex boyfriend attends her wedding..and does this enexpected thing on stage - bsb
Author
Hyderabad, First Published Jun 18, 2021, 12:45 PM IST

ఇంటర్నెట్ లో ఇటీవల చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అలాంటివాటిల్లో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రేమించిన యువతి పెళ్లికి వెళ్లిన ఓ యువకుడు ఏం చేశాడన్నదే ఆ వీడియో.
 
అచ్చంగా సినిమాల్లో చూపించినట్టుగానే ఇద్దరు ప్రేమించుకోవడం, యువతికి మరో పెళ్లి.. యువకుడు ఆ పెళ్లికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే.. సేమ్ టు సేమ్ ఆ వీడియోలో కనిపించింది. 

ఇన్ స్టా గ్రామ్ లో నిరంజ్ మహాపాత్ర పోస్ట్ చేసిన ఈ వీడియోకు మిక్స్ డ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే.. ఓ యువకుడు వధువు దగ్గరికి వెళ్లి స్వీట్ నోట్లో పెడతాడు. ఆమె అది తినడానికి నిరాకరిస్తే చేతిలో పెట్టి.. కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి పోతాడు.

ఇది ఆ వధువు మాజీ లవర్ అని ప్రచారం సాగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ వీడియో అయితే వైరల్ గా మారింది. 

ఇలాంటిదే మరో వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఓ వరుడు తన పెళ్లిలో భోజ్ పురిలో సూపర్ హిట్ అయిన ఓ పాటకు డ్యాన్స్ వేశాడు. ఈ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. 

బంగారు రంగు షెర్వానీ, మెరూన్ సఫారి ధరించిన వరుడు  స్పెషల్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. అతని కదలికలు, దవడలు కదిలించడం అన్నీ విచిత్రంగా ఉండి ప్రేక్షకులు నవ్వుకునేలా చేశాయి. అందుకే ఈ వైరల్ పెళ్లి వీడియోను మళ్లీ మళ్లీ చూసి ఆనందించారు.

ఇలాంటివి ఈ కరోనా కష్టకాలంలో మీ మొహాల్లో కాస్త చిరునవ్వులను పూయించేలా చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios