Asianet News TeluguAsianet News Telugu

జైలు కాదది.. గెస్ట్‌హౌస్: మ‌ద్యం తాగుతూ, ఊగుతూ ఎంజాయ్ చేస్తోన్న నేర‌గాళ్లు

వివిధ నేరాల‌కు పాల్ప‌డి జైలులో శిక్షను అనుభవిస్తున్న కొందరికి కారాగారాలు గెస్ట్‌హౌస్‌ల మాదిరిగా మారుతున్నాయి. అధికారుల అవినీతి కారణంగా కొన్ని జైళ్లు నేరస్తులకు స్వర్గంలా వుంటున్నాయి. తాజాగా కొంద‌రు యువ‌కులు దేశంలోని భయంకరమైన జైలుగా  చెప్పుకునే తిహార్ జైలులో ఎంచ‌క్కా మద్యం, కూల్ డ్రింకు తాగుతూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు

video of gangsters partying inside a lockup
Author
New Delhi, First Published Aug 26, 2021, 2:31 PM IST

వివిధ నేరాల‌కు పాల్ప‌డి జైలులో శిక్షను అనుభవిస్తున్న కొందరికి కారాగారాలు గెస్ట్‌హౌస్‌ల మాదిరిగా మారుతున్నాయి. అధికారుల అవినీతి కారణంగా కొన్ని జైళ్లు నేరస్తులకు స్వర్గంలా వుంటున్నాయి. తాజాగా కొంద‌రు యువ‌కులు దేశంలోని భయంకరమైన జైలుగా  చెప్పుకునే తిహార్ జైలులో ఎంచ‌క్కా మద్యం, కూల్ డ్రింకు తాగుతూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

రాహుల్ కాలా, న‌వీన్ బాలి అనే ఇద్దరు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఆగ‌స్టు 10 వ‌ర‌కు స్పెష‌ల్ సెల్ క‌స్ట‌డీలో ఉన్న ఈ ఇద్ద‌రినీ ఇటీవ‌లే మండోలి జైలుకు పంపారు. వారిద్ద‌రితో పాటు మ‌రో ముగ్గురు నిందితులు కూడా ఇదే జైలులో ఉన్నారు. అయితే హ‌త్య‌లు, దోపిడీ కేసులో అరెస్ట‌యిన నేర‌స్థులు జైలులో హాయిగా ఎంజాయ్ చేస్తుండం అధికార వర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. వీడియోలు వైరల్ కావడంతో సీరియస్ అయిన అధికారులు అసలు వారికి జైలులో మ‌ద్యం ఎలా అందింద‌ని నెటిజ‌న్లు పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios