దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉఃన్నట్లు తెలిపారు. వెంకయ్య నాయుడికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. ముందు జాగ్రత్తగా వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులకు చేసిన కరోనా నిర్థారణా పరీక్షల్లో వారికి నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.