ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి పై ఆధిక్యాన్ని సాధించి విజేతగా నిలిచారు. ఈ విజయంతో సీపీ రాధాకృష్ణన్ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Vice President Elections 2025 : 15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక

Vice President Elections 2025 : భారతదేశానికి నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ మంగళవారం జరిగింది. ఎన్డీయే నుండి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుండి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. 15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.
Vice President Elections 202515వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక
Vice President Elections 2025ముగిసిన ఓటింగ్.. రాత్రి 7:45 గంటలకు ఫలితాలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాత్రి 7:45 గంటలకు ఫలితాలు ప్రకటించనున్నారు.
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఐక్యంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సోషల్ మీడియా వేదిక Xలో “ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ ముగిసింది. ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచాయి. దాని 315 మంది ఎంపీలలో అందరూ ఓటింగ్‌కు హాజరయ్యారు. ఇది అపూర్వమైన 100% పోలింగ్” అని తెలిపారు.
Vice President Elections 2025ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ పూర్తి
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటల నుండి ఎంపీలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు... ఇలా ఇప్పటివరకు 70 శాతం పోలింగ్ నమోదయ్యింంది. మొత్తం 781 మంది ఎంపీల్లో ఇప్పటివరకు 528 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది... 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి పలితం ప్రకటిస్తారు.
Vice President Elections 2025ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని
మాజీ ప్రధాని, ప్రస్తుత జెడి(ఎస్) రాజ్యసభ సభ్యులు హెచ్డి దేవెగౌడ వీల్ చైర్ పై వచ్చిమరి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Vice President Elections 2025ఓటేసిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Vice President Elections 2025ఓటేసిన ఎంపీలు శశిథరూర్, కంగనా
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఎంపీలు శశి థరూర్, కంగనా రనౌత్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Vice President Elections 2025ఓటేసిన సోనీయా గాంధీ
ఇండియా కూటమి నాయకులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ ఓటేశారు.
Vice President Elections 2025తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారరు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

Vice President Elections 2025పోలింగ్ ప్రారంభం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమయ్యింది. మొదటి ఓటు ప్రధాని నరేంద్ర మోదీ వేశారు.
Vice President Elections 2025ఉపరాష్ట్రపతి పోలింగ్ లో రామ్మోహన్ నాయుడికి కీలక బాధ్యతలు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు నాయకుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్డిఏ అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్ వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు కిరణ్ రిజుజు, శ్రీకాంత్ షిండే ఎన్డిఏ పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.