Uttarakhand: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో వేదాలు, రామాయణం, గీతాలను బోధించాలని ఉత్తరాఖండ్‌ విద్యాశాఖ మంత్రి ధన్‌సింగ్‌ రావత్‌ అన్నారు.  ఇందుకోసం సామాన్యుల‌ నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలిపారు.పరీక్షకు ముందు పిల్లలకు సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి తెలిపారు. దీనిపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలన్నారు.  

Uttarakhand: భవిష్యత్తులో పాఠశాల విద్య‌లో పాఠ్యాంశాలుగా వేదాలు, ఉపనిషత్తులు, గీతాలను చేర్చేందుకు కృషి చేస్తామని ఉత్తరాఖండ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ తెలిపారు. ఉత్తరాఖండ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ డూన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాఠ‌శాల స్థాయిలో పాఠ్యాంశంగా వేదాలు, ఉపనిషత్తులు, గీతాలను చేర్చేందుకు కృషి చేస్తామని, ఇందుకోసం సామాన్య ప్రజల నుంచి కూడా సూచనలు ఆహ్వానిస్తామని మంత్రి తెలిపారు. 

అలాగే ఉత్తరాఖండ్ చరిత్ర, భౌగోళిక అంశాలను విద్యార్థులకు బోధించనున్నట్లు ధన్ సింగ్ రావత్ తెలిపారు. పరీక్షకు ముందు పిల్లలకు సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి తెలిపారు. దీనిపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలంటే పండగ అని పిల్లలకు వివరించాలని, ఏ పరీక్షనైనా పండుగలా భావించాలన్నారు. పండుగలా తీసుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ‘పరీక్షా పర్’ చర్చా కార్యక్రమం వల్ల లక్షలాది మంది చిన్నారుల్లో మనోధైర్యం పెరిగిందని తెలిపారు. 

నూతన విద్యా విధానం ప్రకారం భారతీయ చరిత్ర, సంప్రదాయాల ఆధారంగా విద్యార్థుల సిలబస్‌ను రూపొందించాలి. వేదపురాణం, గీతతోపాటు స్థానిక జానపద భాషలను ప్రోత్సహించాలి. దేశంలోనే నూత‌న‌ విద్యా విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. త్వరలో కొత్త సిలబస్‌ను రూపొందించి, కొత్త విద్యా విధానంలోని నిబంధనలను కేబినెట్ సమావేశంలో ముద్రిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి తెలిపారు. కొత్త సిలబస్‌లో ఉత్తరాఖండ్ ఉద్యమ చరిత్ర, మహానుభావుల గురించి కూడా బోధించనున్నట్లు సమాచారం. 

ఉత్తరాఖండ్ లో విద్యారంగానికి ఈ సారి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్‌లో, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం 1100 కోట్లకు పైగా నిధులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. ఇదే జరిగితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమరీ నుంచి సెకండరీ ఫర్నీచర్ వరకు అవసరమైన వనరులను సమీకరించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని తెలిపారు. 

ఈసారి ఉత్తరాఖండ్‌కు మరింత ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారనీ, రాష్ట్ర అవసరాలకు సంబంధించి 10 అంశాల్లో కేంద్రం నుంచి సహాయం ఆశించ‌మ‌ని తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ కోసం, రాష్ట్ర బడ్జెట్ పరిమితి సుమారు 907 కోట్లుగా నిర్ణయించబడిందని, 25 శాతం ఎక్కువ బడ్జెట్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ తెలిపారు.

 వాస్తవానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్న 4705 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్స్ లేదా బాల్ వాటికను అభివృద్ధి చేసేందుకు రూ.47.05 కోట్లు కోరింది. విద్యా వ్యవస్థ నాణ్యత కోసం, రాష్ట్ర ప్రభుత్వం 35 కేంద్రీయ విద్యాలయాలు 9 సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 

అదేవిధంగా, ప్రస్తుత సెషన్‌లో, అదనంగా 1000 స్మార్ట్ తరగతుల కోసం కేంద్రం నుండి 25 కోట్ల మొత్తాన్ని కోరింది. ఆంగ్ల విద్య కోసం 5173 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్‌పై నియమించబడతారు. ఇందుకోసం దాదాపు 125 కోట్లు వెచ్చించనున్నారు. జాతీయ విద్యా విధానం కింద 1386 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ఉపాధ్యాయుల నియామకానికి 41.58 కోట్లు ప్రతిపాదించారు.

రుద్రప్రయాగ్, ఉధమ్ సింగ్ నగర్, బాగేశ్వర్, ఉత్తరకాశీ నాలుగు జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు 120 కోట్లు ప్రతిపాదించారు. ప్రతి బ్లాక్‌లో హాస్టల్ పథకాన్ని ప్రతిపాదించారు. ఇందుకోసం 2850 కోట్లు ప్రతిపాదించారు. మొత్తం 14040 ప్రాథమిక పాఠశాలల్లో మొదటి దశలో స్మార్ట్ టీవీలను అందించేందుకు 70.20 కోట్లు ప్రతిపాదించారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్య, విద్యా వాతావరణం కోసం విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ తెలిపారు. రాష్ట్రంలో విద్య నాణ్యత పెను సవాల్‌గా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వేగంగా పెరుగుతోంది, కానీ విద్యా ప్రమాణాలు మెరుగుపడలేదనీ, విద్యారంగంలో సంస్కరణల కోసం చర్చల ద్వారా మంచి సూచనలు తీసుకుంటారు. త్వరలో డైలాగ్ ప్రోగ్రాం ప్రారంభం కానుందని తెలిపారు.