Asianet News TeluguAsianet News Telugu

వారణాసి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్ స్థానాల్లో అత్యంత కీలకమైనది వారణాసి. 1957 నుంచి నేటి వరకు భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. యూపీ మాజీ సీఎంలు త్రిభువన్ సింగ్, కమలాపతి త్రిపాఠి, బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీలు వారణాసి నుంచే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆధ్యాత్మికపరంగానే కాదు.. రాజకీయంగానూ వారణాసికి ఎంతో ప్రత్యేకత వుంది.  వారణాసి పార్లమెంట్ పరిధిలో రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ స్థానాలున్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పట్టుదలతో వున్నారు. వారణాసిని కాపాడుకోవడం బీజేపీకి, దాని హిందుత్వ బ్రాండ్ రాజకీయాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం

Varanasi Lok Sabha elections result 2024 ksp
Author
First Published Mar 14, 2024, 8:02 PM IST

వారణాసి.. భారతీయుల ఆధ్యాత్మిక కేంద్రం. కోట్లాది మంది హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే యాత్రా స్థలం. గంగలో మునిగి, కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటే తమకు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మిక. భారతీయుల ఇతిహాసం మహాభారతంలోనూ వారణాసి ప్రస్తావన వుంది. జ్ఞానవాపి మసీదు, అలంగీర్ మసీదులు ఇక్కడే వున్నందున వారణాసి ముస్లింలకు సైతం అత్యంత కీలకమైనది. ఆధ్యాత్మికపరంగానే కాదు.. రాజకీయంగానూ వారణాసికి ఎంతో ప్రత్యేకత వుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్ స్థానాల్లో అత్యంత కీలకమైనది వారణాసి. 1957 నుంచి నేటి వరకు భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. దీనికి ముందు వారణాసిని బనారస్ (తూర్పు), బనారస్ (సెంట్రల్) నియోజకవర్గాలుగా విభజించారు. వారణాసి లోక్‌సభ సెగ్మెంట్ .. వారణాసి జిల్లాలో విస్తరించి వుంది. ఇక్కడి నుంచి ఎంతోమంది ఉద్ధండులు పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. యూపీ మాజీ సీఎంలు త్రిభువన్ సింగ్, కమలాపతి త్రిపాఠి, బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీలు వారణాసి నుంచే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 

వారణాసి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. తొలుత కాంగ్రెస్, తర్వాత బీజేపీ :

1952లో ఏర్పడిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోట. తర్వాత బీజేపీకి అడ్డాగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ 8 సార్లు, బీజేపీ 7 సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. వారణాసి పార్లమెంట్ పరిధిలో రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ స్థానాలున్నాయి. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి పార్లమెంట్ పరిధిలోని ఐదు శాసనసభ స్థానాల్లో బీజేపీ 4, అప్నాదళ్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 

1,535 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వున్న వారణాసి జిల్లా మొత్తం జనాభా 36,76,841. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా అక్షరాస్యత శాతం 75.6 శాతం. వారణాసి లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,54,540 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి , ప్రధాని నరేంద్ర మోడీకి 6,74,664 ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి షాలిని యాదవ్‌కు 1,95,159 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్‌కి 1,52,548 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నరేంద్ర మోడీ 4,79,505 ఓట్ల తేడాతో వారణాసిలో విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని పట్టుదలతో వున్నారు. 

వారణాసి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై మోడీ కన్ను :

తన ఒకప్పటి కంచుకోటను తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోంది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారణాసిని కాపాడుకోవడం బీజేపీకి, దాని హిందుత్వ బ్రాండ్ రాజకీయాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. 84.5 శాతం హిందువుల జనాభా వున్న వారణాసి బీజేపీ హిందుత్వ ప్రతిష్టకు ప్రముఖమైనది. 

Follow Us:
Download App:
  • android
  • ios