ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగి పడిన ఘటనతో ధౌలిగంగా నది పోటెత్తింది.ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఓ తల్లి తన కొడుకుకు పదే పదే ఫోన్ చేయడంతో అతనితో పాటు మరో 25 మంది ప్రాణాలతో ఈ ఘటన నుండి బయటపడ్డారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగి పడిన ఘటనతో ధౌలిగంగా నది పోటెత్తింది.ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఓ తల్లి తన కొడుకుకు పదే పదే ఫోన్ చేయడంతో అతనితో పాటు మరో 25 మంది ప్రాణాలతో ఈ ఘటన నుండి బయటపడ్డారు.
ఈ నెల 7వ తేదీన ధౌలిగంగా నదికి ఆకస్మాత్తుగా వరద పోటెత్తింది. దీంతో చమౌలి జిల్లాలోని తపోవన్ పవర్ ప్రాజెక్టు నీట మునిగింది.ఈ ఘటనలో ఇప్పటికే 40 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు.మరో 160 మందికి పైగా ఆచూకీ గల్లంతయ్యారు. తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద విపుల్ కైరేనీ పనిచేసేవాడు. ఈ విద్యుత్ కేంద్రంలో ఓ భారీ వాహనానికి విపుల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఆదివారం నాడు విపుల్ కి సెలవు దినం. ఆ రోజున విధులు నిర్వహిస్తే రెట్టింపు వేతనం చెల్లిస్తారు. ఆ రోజున విధులు నిర్వహిస్తే ఆయనకు రూ. 600 దక్కుతోంది. దీంతో ఆయన ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యాడు.
also read:ఉత్తరాఖండ్‌లో విలయం: 40 మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
విపుల్ విధులు నిర్వహించే సమయంలో పదే పదే తల్లి మాంగ్మ్రీదేవి ఆయనకు ఫోన్ చేసింది. చివరకు ఒక్కసారి విపుల్ ఆమె ఫోన్ ఎత్తాడు. ధౌలిగంగా నదికి వరద వస్తున్న విషయాన్ని ఆమె వివరించింది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కోరింది.
దీంతో విపుల్ తనతో పాటు అక్కడే పనిచేస్తున్న వారిని హెచ్చరిస్తూ అక్కడి నుండి ఎత్తైన ప్రాంతానికి చేరుకొన్నారు. కొద్ది సేపటికే ఈ ప్రాంతం మొత్తం నీట మునిగింది.తన ఇంటి వద్ద తన తల్లి పనిచేస్తున్న సమయంలో ధౌలిగంగా నదికి వరద వచ్చిన విషయాన్ని గుర్తించి తనకు ఫోన్ చేసినట్టుగా విపుల్ గుర్తు చేసుకొన్నాడు.ఆ రోజు తన తల్లి ఫోన్ చేయకపోతే తాము కూడా ఈ వరదలో చిక్కుకొని ఉండేవాళ్లమని ఆయన చెప్పారు.
