Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు: 3 రోజులుగా వేచి చూస్తున్న కుక్క

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఎన్‌టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకొన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

Uttarakhand disaster: 3 days and continuing, loyal dog sits outside Tapovan tunnel waiting for men he knew  lns
Author
New Delhi, First Published Feb 11, 2021, 5:36 PM IST

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఎన్‌టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకొన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న సొరంగం వద్ద మూడు రోజులుగా భూటియా జాతికి చెందిన కుక్క తచ్చాడుతోంది.

also read:సొరంగంలో చిక్కుకొన్న 12 మంది కార్మికులు: ఫోన్ కాల్ కాపాడింది

ఈ కుక్క ఈ ప్రాంతంలోనే పుట్టింది. జల విద్యుత్ ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్న కార్మికులు పెట్టే తిండి తినేది. ప్రమాదం జరిగిన రోజున కూడ ఈ ప్రాంతంలో కాకుండా కింద ఉన్న ప్రాంతానికి కుక్క వెళ్లింది. అయితే ఈ ధౌలిగంగా నదిని వరద ముంచెత్తింది. ఈ వరదలో సొరంగంలో సుమారు 34 మంది కార్మికులు  చిక్కుకొన్నారు.

కుక్క తిరిగి వచ్చేసరికి ఈ ప్రాంతంలో అందరూ కొత్తవారే కన్పించారు. అంతా వరద కారణంగా బురదతో నిండిపోయింది. సహాయక చర్యలు చేస్తున్న సిబ్బందిని కుక్కను అక్కడి నుండి తరిమివేసినా కుక్క పదే పదే అక్కడికి వచ్చింది.

స్థానికులు ఈ కుక్క ఇక్కడే పుట్టిందని చెప్పారు.  దీంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది ప్రతి రోజు ఆ కుక్కకు భోజనం అందిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios