ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు రైతులు సజీవదహనమైన దారుణ ఘటన జరిగింది. వెచ్చదనం కోసం గుడిసెలో ఏర్పాటు చేసుకున్న కుంపటి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని ఈటా జిల్లా పిఫారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెడితే.. మృతులను కాళిచరణ్ (45), ఆయన మిత్రుడు రాధేశ్యాం (35)గా గుర్తించారు. చలి కాచుకునేందుకు వెలిగించిన కుంపటి నుంచి వచ్చిన మిరుగులుతో నిప్పంటుకుని గుడిసె దగ్ధమైందని కాళిచరణ్ సోదరుడు వెల్లడించారు.
ఇద్దరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామనీ... తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని అదనపు ఎస్పీ ఓపీ సింగ్ పేర్కొన్నారు.