యోగి సర్కార్ సరికొత్త రికార్డు : ఒక్కరోజులో అంత చేసారా?
గ్రీన్ ఉత్తర ప్రదేశ్ దిశగా యోగి సర్కార్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జూలై 20, 2024 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యకాలంలో యూపీలో ఎన్నికోట్ల మొక్కలు నాటారో తెలుసా?
లక్నో : పర్యావరణాన్ని కాపాడే పనిలో పడింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది యోగి సర్కార్. ఇలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జూలై 20న ఒక్కరోజే 36.51 కోట్ల మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు.
ఇలా ఒకేసారి కోట్లాది మొక్కలు నాటడమే కాదు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. జూలై 20 నుండి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో రాష్ట్రంలో 36.80 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు పోటాపోటీగా పాల్గగొన్నాయి. దీంతో 13.53 కోట్ల మొక్కలతో గ్రామీణాభివృద్ధి శాఖ అగ్రస్థానంలో నిలిచింది. అటవీ శాఖ 12.92 కోట్ల మొక్కలు నాటింది.
జిల్లాల పరంగా చూసుకుంటే సోన్‌భద్ర ముందంజలో ఉంది. ఇక్కడ 1.55 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన 'ఒక చెట్టు తల్లి పేరున' ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
రెండు నెలల్లోనే 36.80 కోట్ల మొక్కలు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూలై 20న రాష్ట్ర రాజధాని లక్నోలో స్వయంగా మొక్క నాటారు. తద్వారా 'చెట్టు నాటండి, చెట్టు కాపాడండి - 2024' ప్రచారాన్ని ప్రారంభించారు. అదే రోజు ముఖ్యమంత్రి గోరఖ్‌పూర్, ప్రయాగ రాజ్ లలో కూడా మొక్కలు నాటి ప్రచారానికి ఊపునిచ్చారు. మొత్తంగా ఈ ఒక్కరోజే 36.50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకుమించి 36,51,45,477 కోట్ల మొక్కలు నాటారు, ఇది ప్రభుత్వ లక్ష్యం కంటే 1,45,477 ఎక్కువ.
సీఎం యోగి ఆదేశాల మేరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమం జూలై 20 నుండి అలాగే కొనసాగింది. అందరి సమిష్టి కృషి ఫలితంగా జూలై 20 నుండి సెప్టెంబర్ 30 మధ్య ఈ సంఖ్య 36.51 కోట్ల నుండి 36.80 కోట్లకు చేరుకుంది. అటవీ, వన్యప్రాణులు & పర్యావరణ శాఖ నేతృత్వంలో అన్ని శాఖల సమిష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైంది.
1.55 కోట్ల మొక్కలతో టాప్ లో నిలిచిన జిల్లా ఇదే
ఈ ప్రచారంలో భాగంగా అత్యధికంగా సోన్‌భద్రలో మొక్కలు నాటారు. జూలై 20న సోన్‌భద్రలో 1.53 కోట్ల మొక్కలు నాటారు. సెప్టెంబర్ 30 నాటికి ఇక్కడ 1.55 కోట్ల మొక్కలు నాటారు. జూలై 20న ఝాన్సీలో 97 లక్షల మొక్కలు నాటగా, ఇప్పుడు అది 98.70 లక్షలకు చేరుకుంది. లఖింపూర్ ఖేరీలో 95 లక్షల నుండి సెప్టెంబర్ 30 నాటికి 96.18 లక్షలకు చేరుకుంది. జూలై 20న జలౌన్‌లో 94 లక్షల మొక్కలు నాటారు. సెప్టెంబర్ 30 నాటికి ఇక్కడ 95.22 లక్షల మొక్కలు నాటారు. మీర్జాపూర్‌లో 93 లక్షల నుండి సెప్టెంబర్ 30 నాటికి 94.06 లక్షల మొక్కలు నాటారు.
గ్రామీణాభివృద్ధి శాఖ అత్యధిక మొక్కలు
గ్రామీణాభివృద్ధి శాఖ అత్యధికంగా మొక్కలు నాటింది. సెప్టెంబర్ 30 నాటికి ఈ శాఖ 13,54,62,142 మొక్కలు నాటింది. అటవీ శాఖ ఈ కాలంలో 12,92,66,486 మొక్కలు నాటి ఉత్తరప్రదేశ్‌లో హరిత విస్తరణకు ప్రత్యేక పాత్ర పోషించింది. వ్యవసాయ శాఖ 2,89,46,222 కోట్ల మొక్కలు నాటింది. ఉద్యానవన శాఖ 1 కోటి 61 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ 1 కోటి 18 లక్షలకు పైగా మొక్కలు నాటాయి.