బాలీవుడ్ నటి ఊర్మిళా మంతోడ్కర్ ను శివసేన ఎమ్మెల్సీగా ఉద్ధవ్ ప్రభుత్వం నామినేట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై సీఎం తుది నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పేర్కొంటున్నారు. గవర్నర్ కోటా కింద 12 మంది నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనున్నారు. 

ఈ 12 మందిలో ఊర్మిళా పేరును ఉద్ధవ్ చేర్చినట్లు పేర్కొంటున్నారు. ఊర్మిళా గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నార్త్ ముంబై నుంచి బరిలోకి దిగారు. కానీ ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పింది. 

ఊర్మిళాను ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ‘‘ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నారన్న ఊహాగానాలను నేనూ విన్నాను. అది రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుంది.  చివరి నిర్ణయం తీసుకోవడానికి ఉద్ధవ్ కే అధికారమిచ్చాం.’’ అని రౌత్ తెలిపారు. 

అయితే గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. అందులో ఎవరెవర్ని నామినేట్ చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.