అయోధ్య:అయోధ్యలో రామ మందిరం నిర్మించేవరకు భోజనం ముట్టనని ఊర్మిళ చతుర్వేది 27 ఏళ్ల క్రితం ప్రతినబూనింది. ఇప్పటివరకు ఆమె తన ప్రతినను వీడలేదు. 1992లో ఆమె ఈ శపథం చేశారు.

ఊర్మిళ చతుర్వేది వయస్సు ప్రస్తుతం 87  ఏళ్లు. 27 ఏళ్లుగా ఆమె భోజనం చేయడం లేదు. కేవలం పండ్లు మాత్రమే తీసుకొంటుంది. జబల్ పూర్ పట్టణంలోని విజయ్ నగర్ లో ఊర్మిళ చతుర్వేది నివాసం ఉంటున్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన సమయంలోనే తాను భోజనం చేస్తానని శపథం చేసింది. 

also read:రామ మందిరం కోసం 28 ఏళ్ల బ్రహ్మచర్యం: ఇక జీవితమంతా ఇలా...

తనను అయోధ్యకు తీసుకెళ్లాలని ఆమె తన కుటుంబసభ్యులను కోరింది. అయితే తర్వాత తీసుకెళ్తామని వారు ఆమెకు హామీ ఇచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు భోజనాన్ని ఆమె మానుకొంది. మర్యాద పురుషోత్తముడి ఆశ్రమంలో ఆమె గడపనుంది. 87 ఏళ్ల చతుర్వేది తన మిగిలిన జీవితాన్ని రాముడి సన్నిధిలో గడపనుంది.

ఆమెకు కుటుంబసభ్యుల నుండి కూడ మద్దతు లభించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేయడంతో ఆమె ఆహారం తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.