యూపీ ట్రేడ్ షో 2024 : చిరు వ్యాపారులకు అంతర్జాతీయ గుర్తింపు

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో చిన్న వ్యాపారులకు దేశ విదేశాల్లో వ్యాపార అవకాశాలను కల్పించింది. ట్రేడ్ షోలో పాల్గొన్న వ్యాపారులు బ్రాండ్ గుర్తింపు పెరగడంతో పాటు అంతర్జాతీయ ఆర్డర్లు కూడా అందుకున్నారు.

UPITS 2024: Small Businesses Soar High with International Orders AKP

గ్రేటర్ నోయిడా  పల్లవి శర్మ తొలిసారి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోకి వచ్చారు... తన అత్త, చిన్న కొడుకుతో కలిసి లక్నో నుండి వచ్చిన ఆమె తొలిసారిగా ఈ ట్రేడ్ షోలో స్టాల్ పెట్టారు. ఇలా తన వ్యాపారాన్ని వృద్ది చేసుకోవాలని కోరుకుంటున్న ఆమె కల ట్రేడ్ షో ద్వారా సాకారం అయ్యింది. ఈమె తీసుకువచ్చిన ఉత్పత్తులకు దేశీయంగానే కాదు భూటాన్, శ్రీలంక, దుబాయ్ నుండి ఆర్డర్లు వచ్చాయి.

ఇలా పల్లవి ఒక్కరే కాదు యూపీలోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది చిరు వ్యాపారుల కలలను కూడా యోగి ప్రభుత్వం సాకారం చేసింది. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ద్వారా చిరు వ్యాపారులకు దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాల్లోనూ వ్యాపార అవకాశాలను కల్పించింది. దేశంలోని వివిధ నగరాలకు చెందిన వ్యాపారులు తన వ్యాపారంలో ఆసక్తి చూపారని పల్లవి శర్మ తెలిపారు. ఆర్డర్లు కూడా బాగానే వచ్చాయి. దుబాయ్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాల వ్యాపారులు ఆసక్తి చూపడంతో మరింత సంతోషం కలిగిందని ఆమె అన్నారు. 

ఆర్డర్లే ఆర్ఢర్లు 

ఐదు రోజుల పాటు జరిగిన ట్రేడ్ షో పూర్తిగా విజయవంతమైందని ఫిరోజాబాద్ కు చెందిన గాజు సామాగ్రి వ్యాపారి ప్రతీష్ కుమార్ తెలిపారు. ఈ ఐదు రోజుల్లో స్టాల్ కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారులు వచ్చారు. చాలా ఆర్డర్లు వచ్చాయని ప్రతీష్ అన్నారు. వచ్చినన్ని ఆర్డర్లు మా ఉత్పత్తి సరిపోదని, డెలివరీలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉందని అన్నారు. గత ట్రేడ్ షోతో పోలిస్తే ఈసారి ఎక్కువ ఆర్డర్లు రావడంతో ప్రతీష్ ఆనందానికి అవధులు లేవు.

ట్రేడ్ షో ద్వారా బ్రాండ్ కు గుర్తింపు

గ్రేటర్ నోయిడాకు చెందిన మహిళా వ్యాపారవేత్త గురిందర్ కౌర్ తొలిసారిగా యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో పాల్గొన్నారు. ఈమెది ఫుల్కారీ, హ్యాండ్ ప్రింట్స్ సూట్ల తయారీ వ్యాపారం. బ్రాండ్ ప్రమోషన్ కు ట్రేడ్ షో చాలా అద్భుతమైన వేదిక అని గురిందర్ తెలిపారు. ఒకే చోట ఉత్పత్తులను విక్రయించడానికి స్థలం లభించడమే కాకుండా దేశ, విదేశాలకు చెందిన వ్యాపారులతో భాగస్వామ్యం అయ్యే అవకాశం కూడా లభించిందని ఆమె అన్నారు.

15 లక్షల వరకు బుకింగ్

తనది హోం డెకర్, ఫర్నీచర్ వ్యాపారమని మురాదాబాద్ కు చెందిన వ్యాపారి వీరేష్ గోస్వామి తెలిపారు. ట్రేడ్ షో ద్వారా తన వ్యాపారానికి చాలా మేలు జరిగిందని ఆయన అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కొనుగోలుదారులు, దుకాణదారులతో మాట్లాడే అవకాశం లభించడమే కాకుండా బ్రాండ్ కు కూడా మంచి గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. 6 లక్షల వరకు ఆర్డర్లు వచ్చాయని, 15 లక్షల వరకు బుకింగ్ జరిగిందని, వాటిపై త్వరలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వీరేష్ తెలిపారు.

క్రమం తప్పకుండా నిర్వహించాలి

బాగపత్ కు చెందిన దిల్షాద్ అలీ హోం ఫినిషింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆదివారం చివరి రోజు కూడా బాగానే ఆర్డర్లు వచ్చాయని దిల్షాద్ తెలిపారు. వ్యాపారం పరంగా ఇది చాలా మంచి వేదిక అని నిరూపితమైందని ఆయన అన్నారు. వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి యోగి ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని, స్టాల్ ఏర్పాటుకు తమకు సబ్సిడీ కూడా ఇచ్చారని దిల్షాద్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios