UPITS 2024: యోగి సర్కార్ ప్రయత్నాలకు అద్భుత ఫలితాలు ... నిదర్శనమిదే!
ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. శనివారం సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ స్టాళ్లను సందర్శించి సంబంధిత విభాగాల పనితీరును ప్రశంసించారు.
గ్రేటర్ నోయిడా : ఉత్తర ప్రదేశ్ ను 'ఉత్తమ ప్రదేశ్' తీర్చిదిద్దాలన్నది సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యం ... ఇందులో భాగంగానే ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇలా యోగి సర్కార్ చేపట్టిన ప్రయత్నాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ UPITS 2024.
గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరుగుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (UPITS) రెండవ ఎడిషన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ ఈ షో కు హాజరై స్టాళ్లను పరిశీలించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇవాళ (శనివారం) నాలుగో రోజు. రేపు (ఆదివారం) ఒక్కరోజే ఈ యూపిఐటిఎస్ కొనసాగుతుంది.
ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ఏర్పాటు చేసిన సమాచార శాఖతో సహా వివిధ శాఖల స్టాళ్లను సంజయ్ ప్రసాద్ సందర్శించారు. స్టాళ్ల వద్ద ఉన్న వ్యాపారులతో ఆయన మాట్లాడి, ఈ కార్యక్రమం ద్వారా లభిస్తున్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు.
వ్యాపార వృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేసిన వ్యాపారులు
స్టాళ్లను సందర్శిస్తున్న సమయంలో వ్యాపారులు సంజయ్ ప్రసాద్‌తో ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా వారి వ్యాపారాలు, మార్కెట్ విస్తరణ, ఆదాయం పెరుగుదల వంటి అంశాలపై వివరించారు. వ్యాపార వృద్ధిపై వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ మాట్లాడుతూ... యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ద్వితీయ ఎడిషన్ రాష్ట్ర ప్రభుత్వ సమర్థవంతమైన నాయకత్వంలో మొదటి ఎడిషన్ మాదిరిగానే విజయవంతంగా జరుగుతోందని అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ద్వారా మన వ్యాపారులకు ఎక్కువ వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఉత్తర ప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని సంజయ్ ప్రసాద్ అన్నారు.