Asianet News TeluguAsianet News Telugu

పంచాయతీ ఎన్నికల్లో పోటీ.. మహిళ చీర లాగి..!

ఆమె చేతిలోని నామినేషన్ పేపర్లను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చీర లాగేశారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

UP Shocker: On Camera, Samajwadi Worker's Sari Yanked By Political Rivals
Author
Hyderabad, First Published Jul 9, 2021, 9:16 AM IST

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.. అక్కడ ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది.  పంచాయతీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరుపు నుంచి పోటీ చేస్తున్న ఓ మహిళ చీరను ప్రత్యర్థులు లాగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. ఓ మహిళ సమాజ్ వాద్ పార్టీ తరపున నామినేషన్ వేయాలని అనుకుంది. నామినేషన్ వేయానికి వచ్చిన మహిళను ప్రత్యర్థులు అడ్డుకున్నారు.

ఆమె చేతిలోని నామినేషన్ పేపర్లను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చీర లాగేశారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.

 

దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఇలా చేసింది కచ్చితంగా బీజేపీ నేతలేనని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పై విమర్శలు కూడా చేశారు. ఈ సంఘటన రాజధాని లక్నోకి 130 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపూర్ ఖేరిలో చోటుచేసుకుంది.

ఈ ఎన్నికల సమయంలో...  జరిగిన హింసకు సంబంధించిన ఓ వీడియోని ప్రియాంక గాంధీ సైతం ఓ ట్వీట్ చేశారు. అందులో ఓ వీడియోని ఆమె షేర్ చేశారు.  కాగా.. ఇటీవల జరిగిన యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios