UPITS 2024లో ప్రత్యేక ఆకర్షణగా జలశక్తి మంత్రిత్వ శాఖ స్టాల్ ... ఎందుకంత స్పెషల్?

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో జలశక్తి మంత్రిత్వ శాఖ స్టాల్ సందర్శకులను ఆకర్షించింది. జల్ జీవన్ మిషన్ విజయాలను జానపదాలు, ప్రదర్శనలతో ప్రదర్శించారు.  

UP International Trade Show: Jal Shakti Ministry stall draws crowds with Jal Jeevan Mission showcase AKP

గ్రేటర్ నోయిడా : యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఉత్తరప్రదేశ్ జలశక్తి మంత్రిత్వ శాఖ స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. స్టాల్ ప్రవేశ ద్వారం వద్ద నల్లా నుండి నీరు వచ్చే ఆకృతి సందర్శకులను సెల్ఫీలు దిగేలా చేసింది. అలాగే స్థానిక కళాకారులు జల్ జీవన్ మిషన్ విజయాలపై జానపదాలు ప్రదర్శించారు. జల్ జీవన్ మిషన్ విజయాన్ని పాటల రూపంలో ప్రజలకు చేర్చారు కళాకారులు

‘మోడీ-యోగి నే జో కహా వో కర్కే దిఖాయా...(మోదీ యోగి ఏది చెప్పారో అది చేసి చూపించారు) ’ ‘మోడీ యోగి నే మిల్కర్ యోజన బనాయీ, హర్ ఘర్ జల్ జీవన్ కీ పూర్తి కరాయీ (మోదీ యోగి కలిసి యోజన రూపొందించారు - ప్రతి ఇంటికి నీటిని అందించారు)’' అంటూ సాగిన పాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. స్టాల్‌ను సందర్శించే ప్రతి ఒక్కరూ మంత్రిత్వ శాఖ విజయాలను ప్రశంసిస్తున్నారు.

గతంలో బుందేల్‌ఖండ్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం యోగి ప్రభుత్వం 95 శాతం ఇళ్లకు నల్లా ద్వారా నీటిని అందిస్తోందని అధికారులు తెలిపారు. పాఠశాలల్లో నీటి సరఫరా, సీఎం గృహ నిర్మాణ పథకం, గోసంరక్షణ కేంద్రం వంటి ఇతర పథకాల గురించి వివరించారు.

UP International Trade Show: Jal Shakti Ministry stall draws crowds with Jal Jeevan Mission showcase AKP

ఆనకట్టలు, బ్యారేజీలు, తీరప్రాంతాల సమాచారం

నీటిపారుదల, జలవనరుల విభాగం స్టాల్‌ను ను పెద్ద సంఖ్యలో  ప్రజలు తిలకించారు. యూపీలోని ఆనకట్టలు, బ్యారేజీలు, తీరప్రాంతాల గురించి సమాచారం తెలుసుకున్నారు. స్టాల్‌లో డజనుకు పైగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి విజయాలను ప్రదర్శించారు. రిహంద్ ఆనకట్ట, భామ్‌గోడా బ్యారేజ్, నరోరా బ్యారేజ్, గిరిజా బ్యారేజ్, మధ్య గంగా బ్యారేజ్ చిత్రాలను ప్రదర్శించారు. రాష్ట్రంలోని 132 ఆనకట్టలు, 20 బ్యారేజీలు, 523 తీరప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలు, వరద నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలు ఆసక్తిగా తెలుసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios